ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదు
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌పై కేసు నమోదైనట్టు సమాచారం అందుతోంది. జానీ మాస్టర్ ప్రస్తుతం తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌కి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. అయితే ఈ డ్యాన్స్‌కు సంబంధించిన గ్రూపులో సతీష్ అనే డాన్సర్ మెంబర్‌గా ఉన్నాడు.ఇప్పుడు అతనే జానీ మాస్టర్ మీద పోలీసులకి ఫిర్యాదు చేశాడని తెలుస్తోంది. జానీ మాస్టర్ నాలుగు నెలల నుంచి తనని షూటింగ్స్‌కి పిలవడం లేదని, తనకి వర్క్ ఇచ్చిన కో ఆర్డినేటర్స్‌ని సైతం బెదిరిస్తున్నాడని కంప్లైంట్‌లో పేర్కొన్నాడు.

ఆయన ఆలా చేయడం వల్ల ఉపాధి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీంతో జానీ మాస్టర్‌పై హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి పరిధి రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యిందని తెలుస్తోంది.అయితే ఈ ఘటనపై జానీ మాస్టర్ ఇప్పటి వరకు స్పందించలేదు. ఇక జానీ మాస్టర్ పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. జనసేన తరుఫున జానీ మాస్టర్ విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కూటమి అధికారంలోకి రావడంతో జానీ మాస్టర్‌కు ప్రభుత్వం తరుఫున ఏదైన పదవి లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications