గ్యాంగ్‌స్టర్లుగా చిరు, బాలయ్య.. 2027 సంక్రాంతికి హోరాహోరీ విడుదల
నాలుగు దశాబ్దాలుగా బాక్సాఫీస్ దగ్గర హోరాహోరీగా తలపడుతున్న అగ్ర కథానాయకులు మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ 2027 సంక్రాంతికి మరోసారి తలపడబోతున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య చేస్తున్న సినిమాలు ఆ సమయానికే విడుదల కాబోతున్నాయి. అంతేకాకుండా ఈ రెండు సినిమాల్లోను చిరంజీవి, బాలయ్య గ్యాంగ్ స్టర్లుగా నటిస్తుండటం విశేషం. ఒకే కథా నేపథ్యమున్న సినిమాలతో ఈ అగ్ర హీరోలు వచ్చే సంక్రాంతికి ప్రేక్షకులను అలరించబోతున్నారు. గతంలో కూడా ఒకే కథా నేపథ్యం ఉన్న సినిమాలు రెండు, మూడు సందర్భాల్లో విడుదలయ్యాయి.
బాక్సాఫీస్ దగ్గర యుద్ధమే
బాలయ్య హీరోగా నటించిన అశోక చక్రవర్తి, వెంకటేష్ హీరోగా నటించిన ధ్రువ నక్షత్రం సినిమాలు రెండూ ఒకే కథా నేపథ్యంతో విడుదలయ్యాయి. చిత్రంగా ఈ సినిమాల్లో కూడా హీరోలు గ్యాంగ్ స్టర్లుగా నటించారు. ఇప్పుడు చిరంజీవి, బాలయ్య గ్యాంగ్ స్టర్లుగా అలరించబోతున్నారు. ఏ హీరోను, ఏ దర్శకుడు ఎలా చూపిస్తాడో అనే ఉత్కంఠ ఇద్దరు హీరోల అభిమానుల్లో నెలకొంది. అసలే పరిశ్రమలో ఈ ఇద్దరు హీరోల అభిమానులు బాక్సాఫీస్ దగ్గర యుద్ధం చేస్తుంటారు. అలాంటిది ఇప్పుడు కథా నేపథ్యం ఒకటే కావడంతో సినిమా విడుదలైనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో? అని సినీ విశ్లేషకులు అంటున్నారు.

ఒకరిది కోల్ కతా అయితే మరొకరిది ముంబయి
చిరంజీవిది కోల్ కతా నేపథ్యంలో యాక్షన్ డ్రామాగా రాబోతోంది. మోహన్ లాల్ స్పెషల్ క్యామియో చేయనున్నారు. కాకాజీ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య ముందుగా పీరియాడిక్ సినిమా చేయాల్సి ఉంది. అయితే బడ్జెట్ ఎక్కువ కావడంతో కథను మార్చారు. హీరోయిన్ గా నయనతార నటిస్తుందా? లేదంటే కథ మారింది కాబట్టి వేరే హీరోయిన్ ను పెడతారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది. గోపీచంద్ సినిమాను స్లోగా కాకుండా ఫాస్ట్ గా స్క్రీన్ ప్లేను తీర్చిదిద్దగలిగితే సూపర్ హిట్ అవడం గ్యారంటీ అని బాలయ్య అభిమానులు అంటున్నారు. ఈ సినిమా ముంబయి బ్యాక్ డ్రాప్ లో జరగనుంది. ఇద్దరు గ్యాంగస్టర్లలో ఎవరు భయపెడతారు? అనేది వచ్చే సంక్రాంతికి తేలిపోతుంది.












Click it and Unblock the Notifications