35 ఏళ్ల తర్వాత చిరంజీవి సినిమాలో అతని ప్రాణ స్నేహితుడు

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్.. తెర వెనుక వీరిద్దరిదీ దశాబ్దాల ప్రాణస్నేహం. కానీ, అభిమానులను ఊరిస్తూ వచ్చిన ఒకే ఒక్క లోటు ఏంటంటే-స్క్రీన్ పంచుకుని ఏళ్లు గడిచిపోవడం. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడబోతోంది. 35 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ ఒకే ఫ్రేమ్‌లో కనిపించేందుకు రంగం సిద్ధమైంది.

'మన శంకర వరప్రసాద్ గారు' అందించిన జోష్‌తో దూసుకెళ్తున్న చిరంజీవి, ప్రస్తుతం తన 158వ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టారు. 'వాల్తేరు వీరయ్య'తో ఊరమాస్ బ్లాక్‌బస్టర్ అందించిన బాబీ దర్శకత్వంలోనే ఈ సినిమా కూడా తెరకెక్కుతోంది. KVN ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ పవర్‌ఫుల్ గ్యాంగ్‌స్టర్ డ్రామాలో ఒక కీలక పాత్ర కోసం శరత్ కుమార్‌ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Chiranjeevi and Close Friend Sarath Kumar Share the Screen Again After 35 Years

'గ్యాంగ్ లీడర్' కాంబో మళ్లీ రిపీట్ అయితే..!

1990ల ఆరంభంలో వచ్చిన 'గ్యాంగ్ లీడర్' తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త సంచలనం. ఆ తర్వాత 'స్టువర్ట్ పురం పోలీస్ స్టేషన్'లోనూ వీరిద్దరూ కలిసి నటించారు. ఆ రోజుల్లోనే వీరిద్దరి కాంబినేషన్‌కు విపరీతమైన మాస్ క్రేజ్ ఉండేది. అయితే ఆ తర్వాత కాలంలో ఎందుకానో వీరి కాంబో మళ్లీ సెట్ అవ్వలేదు."చిరు నాకు కేవలం సహ నటుడు మాత్రమే కాదు.. నా కష్టకాలంలో కొండంత అండగా నిలిచిన ప్రాణస్నేహితుడు. సరైన స్క్రిప్ట్ కుదరకపోవడం వల్లే ఇన్నాళ్లు కలసి నటించలేకపోయాం" అని శరత్ కుమార్ గతంలో పలు ఇంటర్వ్యూలలో చెప్పారు. శరత్ కుమార్ సతీమణి రాధికతోనూ చిరంజీవికి ఎన్నో ఐకానిక్ హిట్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.

కథను మలుపు తిప్పే షేడ్స్ ఉన్న పాత్ర!

తాజా సమాచారం ప్రకారం-బాబీ ఈ చిత్రంలో శరత్ కుమార్ కోసం ఒక విభిన్నమైన, మల్టీ-షేడ్స్ ఉన్న పవర్‌ఫుల్ నెగెటివ్, గ్రే షేడ్ పాత్రను డిజైన్ చేశారట. ఈ పాత్ర సినిమాకే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. ఇక ఈ మూవీలో చిరంజీవి కుమార్తెగా ప్రముఖ యువ నటి అనశ్వర రాజన్ కనిపిస్తుండగా, ఈ 'ఫ్రెండ్స్' ప్రాజెక్ట్ పై త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. రెండు దశాబ్దాల బంధం, 35 ఏళ్ల తర్వాత మళ్లీ అదే మాస్ మ్యాజిక్.. ఈ వార్త నిజమైతే మాత్రం బాక్సాఫీస్ దగ్గర పూనకాలు ఖాయం అంటున్నారు మెగా అభిమానులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+