వారికి దసరా గిఫ్ట్.. కొత్త పెన్షన్స్ ఇచ్చేందుకు ముహూర్తం ఫిక్స్!

తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి పెద్ద పీట వస్తుంది. ముఖ్యంగా నిరుపేదల జీవితాలలో వెలుగు నింపే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా చాలా కాలంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్దిదారులకు శుభవార్త చెప్పింది. త్వరలో వారికి ఆర్ధిక భరోసా కల్పించేందుకు పచ్చ జెండా ఊపింది.

పేదలకు, అర్హులైన కుటుంబాలకు దసరా పండుగకు ముందే తీపి కబురు చెప్పింది. కొత్త పెన్షన్ల పంపిణీని అక్టోబర్ నెల నుంచే ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న అర్హులైన నిరుపేదలకు ఊరట కలిగించేలా వెరిఫికేషన్ ప్రక్రియను శరవేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.

Telangana new pensions government to start distributing new pensions from October before Dasara

ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులు, వివిధ వర్గాల నుంచి అందిన అర్జీలను క్షేత్రస్థాయిలో త్వరగా పరిశీలించాలని కలెక్టర్లు, అధికారులను కోరింది. అవసరమైతే అదనపు సిబ్బందిని నియమించుకుని జాబితాలు సిద్ధం చేయాలని స్పష్టం చేసింది. దసరా నాటికి అర్హుల ఖాతాల్లో సొమ్ము జమ కావాలని లక్ష్యం పెట్టుకుంది.

ఈ దఫాలో తెలంగాణా ప్రభుత్వం ఒంటరి మహిళలు, వితంతువులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఏ ఒక్క అర్హురాలూ నష్టపోకుండా పారదర్శకంగా పెన్షన్ మంజూరు చేయాలని ప్రభుత్వం సూచించింది. వృద్ధాప్య, వికలాంగ, చేనేత, గీత కార్మికుల వంటి వర్గాల అర్జీలను కూడా వేగంగా పరిశీలించనున్నారు. రాజకీయ జోక్యం లేకుండా కేవలం నిబంధనలు, అర్హతల ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చింది.

తెలంగాణాలో ప్రమాదంలో 43లక్షల ఓట్లు.. నోటీసులకు నో 'సర్' అంటే మీ ఓటు గల్లంతే!
తెలంగాణాలో ప్రమాదంలో 43లక్షల ఓట్లు.. నోటీసులకు నో 'సర్' అంటే మీ ఓటు గల్లంతే!

జిల్లా కలెక్టర్లు మండలాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ పనులను ముమ్మరం చేస్తున్నారు. పండుగ వేళ పేద కుటుంబాల ముఖాల్లో చిరునవ్వులు తేవడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఈ విషయాన్ని మంత్రి సీతక్క వెల్లడించారు. రాబోయే దసరా పండుగకు ముందే ఒంటరి మహిళలు, వితంతువులకు కొత్త సామాజిక పింఛన్లు పంపిణీ చేసేలా క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. అవసరమైతే అదనపు సిబ్బందిని కేటాయించాలని సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్‌ను ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ పథకంలో భాగంగా అర్హులైన అభ్యర్థులందరికీ త్వరలోనే పింఛన్లు అందుతాయని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+