LPG Shortage India: దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత..?? కేంద్రం సంచలన ప్రకటన

ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్- అమెరికా మధ్య యుద్ధం కొనసాగుతూనే ఉంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఆంక్షలు ఉన్నాయి. ఇక ఇటీవల రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం తీవ్రతరం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్, చమురు సంక్షోభం నెలకున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడవుతున్నాయి. పేద, మధ్య తరగతి దేశాలతోపాటు అభివృద్ధి చెందుతున్న దేశాలపైనా ఈ భారం పడుతోంది. అయితే ప్రస్తుతం భారత్ లోనూ గ్యాస్ సిలిండర్ల కొరత, చమురు కొరత ఉందని సామాజిక మాధ్యమాల్లో పలు కథనాలు వైరల్ అవుతున్న నేపథ్యంలో కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి హర్దిప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రస్తుతం దేశంలో ఎలాంటి గ్యాస్ సిలిండర్ల కొరత లేదని స్పష్టం చేశారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని డొమెస్టిక్ ఎల్పీజీ ఉత్పత్తిని గణనీయంగా పెంచినట్లు తెలిపారు. ప్రస్తుతం రోజుకు ఉన్న 34,000 టన్నుల నుంచి 55,000-56,000 టన్నులకు పెంచినట్లు వివరించారు. అయితే ప్రజలు భయాందోళనతో ఎక్కువ సిలిండర్లను బుకింగ్ చేయడం, కొనుగోలు చేయడం లాంటి వాటిని అడ్డుకునేందుకు అంతేకాక బ్లాక్ మార్కెట్ ను కూడా అడ్డుకునేందుకు తాత్కాలికంగా ఆంక్షలు విధించినట్లు తెలిపారు. ఈ మేరకు దేశంలో ప్రస్తుతం ఎల్పీజీ, వంటగ్యాస్ సిలిండర్ల కొరత లేదని, కొరత ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఊహాగానాలు, వదంతులను పట్టించుకోకూడదని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి స్పష్టం చేశారు.

ప్రస్తుతం భారత్ లో 1.07 లక్షల రిటెయిల్ పెట్రోల్ పంప్స్ ఉన్నాయని తెలిపారు. అయితే ఎక్కడా డ్రై అయినట్లు సమాచారం లేదని వివరించారు. అందువల్ల రూమర్స్ ను నమ్మి గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలైన్లలో నిల్చోవద్దని.. ఇబ్బందులు పడొద్దని సూచించారు. వినియోగదారుల కోసం ఆన్ లైన్ బుకింగ్ సమర్థవంతంగా పనిచేస్తుందని వివరించారు. వినియోగదారులు వ్యక్తిగతంగా ఎక్కడకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఇంట్లోనే ఎంచక్కా బుకింగ్ చేసుకోవచ్చని తెలిపారు. బుకింగ్ చేసుకున్న 24 గంటల్లోనే వినియోగదారులకు సిలిండర్ అందుతుందని అందువల్ల నెట్టింట వచ్చే ఎలాంటి రూమర్స్ ను నమ్మొద్దని వివరించారు. ఇటీవలి కాలంలో పానిక్ బుకింగ్ మరోసారి అధికం అయిందని తెలిపారు. సాధారణంగా రోజుకు సగటున 52 లక్షల ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్‌ లు జరుగుతుంటాయని.. కానీ వదంతుల కారణంగా కొన్ని రోజుల పాటు బుకింగ్‌ ల సంఖ్య రోజుకు 90 లక్షలకు పెరిగిందని స్పష్టం చేశారు. పానిక్ బుకింగ్‌లను కట్టడి చేయడానికి పంపిణీ వ్యవస్థను రేషనలైజ్ చేశామని స్పష్టం చేశారు.

gascylinder There is no shortage in the country now Union Minister Hardeep Puri makes key remarks

మరోవైపు సిలిండర్ బుకింగ్ విషయంలో ఎలాంటి బ్లాక్ మార్కెట్ కు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ మేరకు నిబంధనలను మరింత కట్టుదిట్టం చేసింది. ఇక ఈ- కేవైసీ చేయించని వంటగ్యాస్‌ వినియోగదారులకు సబ్సిడీ పథకాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ- కేవైసీ చేసుకున్న గ్యాస్‌ వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ పథకాన్ని వర్తింపజేయాలని.. ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారులు ఇకమీదట మార్కెట్‌ ధరకే సిలిండర్లను ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నట్లు వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+