అతని భూజంపై వాలిపోయిన అనసూయ..అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారంటూ కామెంట్
అనసూయ పేరు టాలీవుడ్‌లో మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది. జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేమ్‌తో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది ఈ బ్యూటీ. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.
రంగస్థలం సినిమా తర్వాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు.

ఈ హ్యాట్ బ్యూటీ 39 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చీర కట్టిన ,స్కర్ట్ వేసిన, బికినితో దర్శనం ఇచ్చిన అది అనసూయకే చెల్లింది. అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ.
ఇదిలా ఉంటే తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలను షేర్ చేసింది. ఆ ఫొటోల్లో ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు. అయితే శేఖర్ మాస్టర్‌తో క్లోజ్‌గా అనసూయ ఫొటోలు దిగడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అతని భుజంపై వాలిపోయిన ఫొటోలను కూడా అనసూయ షేర్ చేసింది. 'మనమందరం స్వీట్, స్పైస్‌లా కలిసి ఉండవచ్చు.. కానీ కొన్ని సార్లు అలా ఉండకపోవచ్చు' అనే క్యాప్షన్‌ను ఈ ఫొటోలకు జత చేసింది.
ఈ ఫొటోలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నీకు మొగుడు ఉన్నాడుగా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, భర్త ఉండగా ఇలా వేరే వాళ్లతో క్లోజ్‌గా మూవ్ అవ్వడానికి సిగ్గు ఉండాలని మరి కొందరు రియాక్ట్ అవుతున్నారు.ఓ నెటిజన్ మాత్రం అవును వాళ్లిద్దరు ఇష్టపడ్డారంటూ కామెంట్ చేశాడు. మరి నెటిజన్ల కామెంట్స్‌పై అనసూయ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి. ప్రస్తుతం అనసూయ , శేఖర్ మాస్టర్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications