సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. స్టార్ దర్శకుడు కుమారుడు మృతి
తమిళ ప్రముఖ డైరెక్టర్ భారతీరాజా ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.. మంగళవారం ఆయన కుమారుడు మనోజ్ భారతీ రాజా (48) అస్వస్తత కారణంగా ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటూ తుది శ్వాస విడిచాడు. భారతీరాజా కుమారుడు మనోజ్ భారతీరాజా కన్నుమూశారన్న వార్త అభిమానులను, సినీ ప్రముఖులను దిగ్భ్రాంతికి గురిచేసింది. దీంతో తమిళ సినీ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
మంగళవారం (మార్చి 25) ఉదయం సమయంలో మనోజ్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డాడు. ఈ విషయం గమనించిన ఆయన కుటుంబ సభ్యులు వెంటనే చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. దీంతో వైద్యులు మనోజ్ ని కాపాడేందుకు ప్రయత్నించినా సాధ్యపడలేదు. దీంతో మనోజ్ వెంటిలేటర్‌పైనే కన్నుమూశారు.

ఆయన 1976 సెప్టెంబర్ 11న జన్మించారు. భారతీరాజా తనయుడు మనోజ్ భారతీరాజా హీరోగా, నటుడిగా పలు సినిమాలు చేశారు. మనోజ్ ని భారతీరాజానే తాజ్ మహల్ అనే సినిమా ద్వారా సినీ పరిశ్రమకు హీరోగా పరిచయం చేశారు.ప్రస్తుతం మనోజ్ భారతీరాజా దర్శకుడిగా ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు.మనోజ్ భారతీ రాజాకి ఇద్దరు సంతానం. ఎంతో మంచి భవిష్యత్ ఉన్న మనోజ్ భారతీ రాజా ఇలా మరణించడంతో భారతీరాజా కుటుంబం ఒక్కసారిగా శోకంలో మునిగిపోయింది.












Click it and Unblock the Notifications