అతను రూ.వెయ్యి కోట్లు ఇస్తానన్నా తీసుకోను: రాజమౌళి

బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా, ఆర్ఆర్ఆర్ చిత్రంతో అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు దర్శక ధీరుడు రాజమౌళి. ప్రస్తుతం పాన్ వరల్డ్ స్థాయిలో భారీ అడ్వెంచర్ సినిమా తీయడానికి రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్‌గా నిలిచి ఆయనకే కాకుండా అందులో నటించిన హీరోలకు కూడా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెడుతోంది. మహేష్ బాబుతో తీయబోయే సినిమా సినిమా తెరపై ఇంతవరకు ఎవరూ చూడని బిగ్ అడ్వెంచర్ గా రానున్నట్లు చెబుతున్నారు.

అనేక విషయాలు నేర్చుకున్నా
సినిమాలోని ప్రతి విభాగంపై స్పష్టమైన పట్టు కలిగిన రాజమౌళి మగధీర సినిమా తీసేటప్పుడు మాత్రం టెన్షన్ పడ్డారు. అప్పటివరకు తెలుగులో అంత భారీ బడ్జెట్ చిత్రం ఏదీ రాలేదు. ఆయనపై నమ్మకంతో నిర్మాతలు ముందుకు రావడంతో సినిమాను తీవారు. ఆ సినిమా చేసే సమయంలోనే రాజమౌళికి ఒక సెట్ వేస్తే ఎంత ఖర్చవుతుంది? ప్రొడక్షన్ టీం కు ఎంతవుతుంది? రూపాయిని జాగ్రత్తగా ఎలా ఖర్చుపెట్టాలి? అనే విషయాలను తెలుసుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో దర్శక ధీరుడు ఈ విషయాలను స్వయంగా చెప్పారు.

director rajamouli comments on In the case of choosing a heroine for his film

పది ఫ్లాపులొచ్చినా ఇబ్బంది లేదు
తాను రాసుకున్న కథ ప్రకారం అందులో హీరోయిన్ గా ఎవరైతే బాగుంటారో వారినే ఎంపిక చేసుకుంటానని, అంతకుముందు ఆ హీరోయిన్ కు 10 ఫ్లాపులొచ్చాయా? అనే విషయాన్ని చూడనన్నారు. కథకు సరిగ్గా సరిపోతుంది అనుకుంటే వెంటనే ఎంపిక చేసుకుంటానన్నారు. కథకు సరిపోరు అనుకుంటే ఎట్టి పరిస్థితుల్లోను తీసుకోనని, అందుకు నిర్మాత రూ.వెయ్యి కోట్లు ఇచ్చినా నిర్మొహమాటంగా తిరస్కరిస్తానన్నారు. ఎవరైనా నిర్మాత ఫలానా హీరోయిన్ ను తీసుకుందామని సూచించినా తీసుకోను అన్నారు. మగధీర సినిమాతో తాను ఎంతో నేర్చుకున్నానని, జానపద చిత్రాలు, పౌరాణిక చిత్రాలు కూడా తాను చేయగలను అనే నమ్మకాన్ని యమదొంగ కల్పించిందని చెప్పారు. ప్రస్తుతం రాజమౌళి మగధీర, యమదొంగ సినిమాలకు సంబంధించి, సినిమాల్లో హీరోయిన్ ఎంపిక గురించి చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+