మహేష్ బాబు పాస్‌పోర్టు సీజ్..ఇప్పట్లో బయటపడటం కష్టమే..!
దర్శక ధీరుడు రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమా కోసం యావత్తు భారతదేశం మొత్తం కూడా ఎంతో అతృతుగా ఎదురు చూస్తోంది. RRR సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించే సినిమా ఇదే. ఇప్పటి వరకు ప్యాన్ ఇండియా రేంజ్‌లో హిట్లు కొట్టిన రాజమౌళి మహేష్ బాబుతో చేయబోయే సినిమాతో పాన్ వరల్డ్‌పై గురి పెట్టారు. ఆఫ్రికన్ ఫారెస్ట్ నేపథ్యంలో ఉంటుందని కథ రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇప్పటికే పలు ఇంటర్వ్యూల్లో చెప్పడం జరిగింది.
మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సైతం ఈ సినిమాకు సంబంధించి రీరికార్డింగ్ పనులు మొదలుపెట్టారని విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా గురించి కీలక ఆప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మహేష్ సినిమాపై దర్శకుడు రాజమౌళి బిగ్ ఆప్డేట్ ఇచ్చారు. సింహాన్ని లాక్ చేసినట్లుగా చూపించి మహేష్ బాబు పాస్‌పోర్ట్‌తో ఫొటోకు పోజ్ ఇచ్చారు.మహేష్ బాబుని లాక్ చేసానని పరోక్షంగా హింట్ ఇస్తూ అతని పాస్‌పోర్టును చూపిస్తూ ఫొటోకి ఫోజిచ్చారు.

రాజమౌళి చేసిన పోస్టుపై మహేష్ బాబు సైతం రియాక్ట్ అయ్యారు.'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను'' అంటూ రాజమౌళి పోస్టుకు మహేష్ రిప్లై ఇచ్చారు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే రాజమౌళి చేసిన పోస్టుకు బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా స్పందించారు. ఎమోజీతో కూడిన సింబల్‌ను పోస్ట్ చేశారు. దీంతో మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న సినిమాలో ప్రియాంక చోప్రా కీలక పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇండోనేషియన్ బ్యూటీ చెల్సియా ఇస్లెన్‌ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే చెల్సియా ఇస్లెన్‌కి స్క్రీన్ టెస్ట్ కూడా నిర్వహించారని సమాచారం అందుతోంది. ఈ సినిమాను హాలీవుడ్ రేంజ్ లో జక్కన్న తెరకేక్కించబోతున్నాడు. సౌతాఫ్రికా అడవుల్లో షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు సమాచారం.త్వరలోనే దీనిపై అఫిషియల్ అనౌన్స్‌మెంట్ ఉంటుందని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications