మహేష్‌బాబుతో సినిమా... ఖాళీ లేదన్న స్టార్ డైరెక్టర్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై డాక్టర్ కె.ఎల్.నారాయణ రూ.1500 కోట్ల బడ్జెట్ తో నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాద్వారా సినీ పరిశ్రమకు మహేష్ బాబు మూడు సంవత్సరాలు దూరం కాబోతున్నారు. రెండు భాగాలుగా వస్తుందా?, ఒక భాగంగా వస్తుందా? అనే విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. ఈ సినిమాలో నటించేందుకు ప్రిన్స్ మేకోవర్ అవుతున్నారు.
సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా రాజానగరంలోని జీఎస్ఎల్ వైద్య కళాశాలలో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను మీడియా పలకరించింది. మహేష్ బాబుతో సినిమా తీస్తానన్నారు.. ఎప్పుడు? అని ప్రశ్నించగా అందుకు తనకు సమయం లేదని, ప్రస్తుతం తాను ఖాళీగా లేనన్నారు. స్పిరిట్ చిత్రం తీస్తున్నానని, దీని తర్వాత యానిమల్ 2 తీయనున్నాన్నారు. వీటికి రెండు నుంచి నాలుగు సంవత్సరాల సమయం పడుతుందని, ఏ సినిమా అయినా వాటి తర్వాతే ఆలోచిస్తానన్నారు. అప్పటి పరిస్థితులను బట్టి ఓ నిర్ణయం తీసుకుంటానన్నారు.

సందీప్ రెడ్డి తీసే సినిమాల్లో ఎక్కువగా వైద్యానికి సంబంధించిన అంశాలే ఎందుకు ఉంటాయని ప్రశ్నించగా ఫిజియో థెరపీ కోర్సు చేసి కొంతకాలం ప్రాక్టీస్ చేశానని, అందువల్లే ఆ ఛాయలు తన సినిమాల్లో కనపడతాయని సందీప్ అన్నారు. సినిమాలద్వారా తానిచ్చే సందేశాన్ని చెబుతూనే ఉన్నానని, ఎవరైనా చేస్తున్న పనిపైనే ఎక్కువగా దృష్టిపెట్టాలని, అప్పుడే మంచి ఫలితాలను అందుకుంటారన్నారు. విద్యార్థిగా ఉన్నప్పుడే సినిమాలపై ఎక్కువగా ఆసక్తి ఉండేదని, ఫిజియో థెరపిస్టుగా ప్రాక్టీసు చేస్తున్న సమయంలోనే తన అడుగులు సినీ పరిశ్రమవైపు పడ్డాయన్నారు.












Click it and Unblock the Notifications