వెయ్యి కోట్లతో డైరెక్టర్ శంకర్ కొత్త చిత్రం.. నమ్మకం లేదు దొర !
సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు దర్శకుడు శంకర్. జెంటిల్‌మన్, ఒకే ఒక్కడు, అపరిచితుడు వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. రోబో మూవీతో టెక్నికల్ పరంగా ఇండియన్ సినిమాని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ కి తీసుకెళ్లారు. కానీ ఇటీవల కాలంలో ఆయన చిత్రాలు ప్రేక్షకులకు ఆశించిన స్థాయిలో అలరించలేకపోయాయి. రజినీ కాంత్ తో మళ్లీ చేసిన " రోబో 2 " పరాజయాన్ని మూటగట్టుకుంది.
ఇక భారీ అంచనాల నడుమ శంకర్- కమల్‌హాసన్ కాంబోలో తెరకెక్కిన 'ఇండియన్ 2' కూడా వారిని కాపాడలేకపోయింది. అలానే ఆర్ఆర్ఆర్ లాంటి సినిమా తర్వాత.. రామ్‌చరణ్ హీరోగా 'గేమ్ ఛేంజర్'ను రూపొందించారు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన ఈ మూవీ భారీ డిజాస్టర్ గా నిలిచింది. దీంతో శంకర్ తీవ్రస్థాయిలో ట్రోల్ అవుతున్నారు.

అయితే ఇప్పుడు అనూహ్యంగా మరో భారీ ప్రాజెక్టుని అనౌన్స్ చేసి షాక్ ఇచ్చారు శంకర్. అంతే కాకుండా ఆ చిత్రం భారతదేశం గర్వించే సినిమా అవుతుందన్నారు. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'అవతార్' వంటి చిత్రాలకు ఉపయోగించిన సాంకేతికను పరిచయం చేయనున్నాను. ప్రపంచమంతా దీన్ని గుర్తిస్తుంది. త్వరలోనే నా కల నిజం కావాలని కోరుకుంటున్నాను'' అని శంకర్ తెలిపారు.
అలానే ఇంకా మాట్లాడుతూ.. లక్ష కాపీలు అమ్ముడైన 'వేల్పారి' (Velpari) అనే నవల గురించి మాట్లాడారు. దీని ఆధారంగా ఆయన తన కలల ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఒకప్పుడు తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'రోబో' అని.. ఇప్పుడు 'వేల్పారి' అని చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ చేసిన అతిపెద్ద చిత్రాల్లో ఇది కూడా ఒకటి అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. భారీ స్థాయిలో కాస్ట్యూమ్స్, ఆర్ట్ డిజైన్స్, టెక్నాలజీ అవసరం ఉందని.. ప్రాజెక్ట్ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
#50YearsOfRAJINISM started by #Shankar 🔥🔥🔥🔥🔥 pic.twitter.com/aMLE0ToLF7
— Baasha Coolie (@baasha_coolie) July 11, 2025
ఈ మూవీ కోసం కన్నడ హీరో యశ్‌తో కూడా సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. వెయ్యి కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నిర్మాతలు కూడా భాగం కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. మరోవైపు ఈ అనౌన్స్ మెంట్ తో సోషల్ మీడియాలో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. మాకు నమ్మకం లేదు దొర అంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications