బ్లాస్టింగ్ న్యూస్: సాయిపల్లవిని కలిసిన సుకుమార్?
దర్శకుడు సుకుమార్ కు తెలుగు సినీ పరిశ్రమలో ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తాను తీసే సినిమాలో సన్నివేశాలకు సంబంధించి ఎక్కడా లాజిక్ లేకుండా తీయరు. అవసరమైతే అందుకు ఎంతైనా కష్టపడతారు. సినిమా చూసే ప్రేక్షకుడు సన్నివేశాల్లోని లాజిక్ గురించి ఆలోచించే అవకాశం ఇవ్వకూడదని, సినిమాను అలాగే తీయాలంటరు. అందుకే అందరూ ఆయన్ను మిస్టర్ పర్ ఫెక్ట్ అంటారు. ప్రస్తుతం పుష్ప సినిమాతో పాన్ ఇండియా డైరెక్టర్ గా మారిపోయారు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. దర్శకుడు సుకుమార్ హీరోయిన్ సాయిపల్లవిని కలిశారు అనేది ఆ వార్త సారాంశం. ప్రస్తుతం తెలుగు ఫిలిం నగర్ లో ఇది బ్లాస్టింగ్ న్యూస్ లా మారింది. తాను తీస్తున్న పుష్ప2 సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్రలో సాయిపల్లవిని నటింపచేసేందుకే ఆయన కలిశారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే అది నిజం కాదని సాయిపల్లవిని ఒక ప్రత్యేక గీతంలో నర్తించేలా చేయాలని కలిసినట్లు మరికొందరు చెబుతున్నారు.

అయితే సాయిపల్లవి మాత్రం ప్రత్యేక గీతాలకు ఒప్పుకోదు. కాబట్టి ఈ సినిమాలోనే నటించబోతోందంటున్నారు. ఒక ప్రధానమైన క్యారెక్టర్ లో సాయిపల్లవిని నటింపచేసే ఉద్దేశంతోనే ఆయన కలిశారంటున్నారు. దీనిపై సుకుమార్ కానీ, సాయిపల్లవి కానీ అధికారికంగా స్పందిస్తేనే ఒక స్పష్టత రానుంది. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప2 విడుదల కాబోతోంది. సినిమా షూటింగ్ మాత్రం అనుకున్నంత వేగంగా సాగడంలేదు. కేశవ పాత్రలో నటిస్తున్న జగదీష్ ప్రతాప్ హత్యకేసులో ఇరుక్కోవడం ఒక కారణమైంది. పాత్ర పరిధి పెద్దది కావడంతోపాటు సినిమా ముందుకు కదలడానికి అవసరమైన పాత్ర కావడంతో నిర్మాతలే తమ సొంత పూచీకత్తుపై అతన్ని బయటకు తీసుకువచ్చారంటున్నారు.












Click it and Unblock the Notifications