'గేమ్ ఛేంజర్' సినిమా గురించి అడగొద్దు..ప్లీజ్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా గురించి ఇప్పటికీ, ఎక్కడో ఒకచోట చర్చ సాగుతూనే ఉంది. RRR సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన చిత్రమే గేమ్ ఛేంజర్. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నెగిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ఇక మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరిచారు. సినిమా ఏమాత్రం బాలేదని మెగా అభిమానులు విమర్శలు గుప్పించారు.

సరైన కథతో సినిమాను తెరకెక్కించడంలో దర్శకుడు శంకర్ ఘోరంగా ఫెయిల్ అయ్యారనే మాటలు వినిపించాయి.ఇదిలా ఉంటే సినిమా కలెక్షన్ల విషయంలో కూడా పెద్ద దుమారమే చేలరేగింది. వచ్చిన కలెక్షన్లకు, ప్రకటించిన కలెక్షన్లకు రూ.100 కోట్లకుపైగానే తేడా కనిపించింది. దీంతో 'గేమ్ ఛేంజర్' కలెక్షన్లు ఫేక్ అని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కలెక్షన్ల విషయంలో విపరీతమైన ట్రోల్స్ రావడంతో , నిర్మాతలు వెనక్కి తగ్గారు. 'గేమ్ ఛేంజర్' రెండో రోజు నుంచి కలెక్షన్లు ప్రకటించడం ఆపేశారు.

Don t ask questions about the game changer - Dil Raju

చిత్ర నిర్మాత దిల్ రాజు సైతం గేమ్ ఛేంజర్ కలెక్షన్లు ఫేక్ అని బహిరంగంగా తేల్చేశారు. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 195 కోట్లు వసూలు చేసింది.రూ.450 కోట్ల రూపాయిలతో భారీ బడ్జెట్‌తో 'గేమ్ ఛేంజర్‌'ను నిర్మించారు. ఫలితంగా రూ.155 కోట్ల నష్టాన్ని ఈ సినిమా మిగిల్చింది.మొత్తానికి రామ్ చరణ్ కెరీర్‌లోనే 'గేమ్ ఛేంజర్' అతి పెద్ద ఫ్లాప్‌గా నిలిచింది. రామ్ చరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేం బుచ్చిబాబు దర్శకత్వంలో తన తర్వాత సినిమా చేస్తున్నారు.

ఇదిలా ఈ సినిమాపై ట్రోల్స్ మాత్రం ఆగడం లేదు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ తాజాగా నటించిన చిత్రం లూసిఫర్-2. ఈ సినిమాకు సలార్ ఫేం పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ప్యాన్ ఇండియా లేవల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు రిలీజ్ చేయనున్నారు. దీనిలో భాగంగానే మోహన్ లాల్ ,పృథ్వీరాజ్ సుకుమారన్,దిల్ రాజు మీడియా సమావేశం నిర్వహించారు. అయితే మీడియా ప్రతినిధులు దిల్ రాజును పదే పదే గేమ్ ఛేంజర్ గురించి ప్రశ్నించారు. దీంతో ఆయన లూసిఫర్-2 సినిమా గురించి మాట్లాడండి, ఎందుకు గేమ్ ఛేంజర్ గురించి అడుగుతున్నారని దిల్ రాజు ఒకింత అసహనం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+