OTT: ఓటీటీలోకి టాలీవుడ్ ఎమోషనల్ థ్రిల్లర్.. ఎక్కడ చూడాలంటే..?

ఇటీవలి కాలంలో చిన్న సినిమాల హవా పెరిగిపోయింది. గతేడాది లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, శంబాలా లాంటి చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచాయి. కంటెంట్ ఉంటే చాలు చిన్న సినిమా అయినా రికార్డు కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది. అలా కొన్ని సినిమాలు థియేటర్లలో అలరిస్తుంటే.. మరికొన్ని వెబ్ సిరీస్ లు మాత్రం ఓటీటీలో రఫ్పాడిస్తున్నాయి.

అయితే తాజాగా ఓటీటీలోకి మరో తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ వచ్చేసింది. టాలీవుడ్ ప్రముఖ నటుడు రాజీవ్ కనకాల, సీనియర్ యాంకర్ ఉదయ్ భాను ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్ సిరీస్ 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు' తాజాగా ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఎమోషనల్ థ్రిల్లర్ గా ఈ సిరీస్ ను తెరకెక్కించారు. సుదీర్ఘ విరామం తర్వాత ఉదయభాను రీ ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ పై అంచనాలు పెరిగాయి.

ఇక తాజాగా 'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు' ట్రైలర్‌ విడుదల చేశారు. దర్శకుడు పోలూరు కృష్ణ తెరకెక్కించిన ఈ సిరీస్‌ 'జీ 5' లో ఫిబ్రవరి 27 నుంచి స్ట్రీమింగ్ కానుందని అధికారికంగా ప్రకటించారు. రెక్కీ, విరాటపాలెం: పీసీ మీనా రిపోర్టింగ్‌.. వంటి సక్సెస్‌ ఫుల్‌ సిరీస్‌లను అందించిన సౌత్ ఇండియన్ స్క్రీన్స్ దీన్ని రూపొందించింది.

'డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు: కనపడుట లేదు' వెబ్ సిరీస్ కథ విషయానికి వస్తే.. వెబ్ సిరీస్ ప్రధానంగా తండ్రీకూతుళ్ల మధ్య ఉన్న ప్రేమ, అనుబంధం చుట్టూ తిరుగుతుంది. రాజీవ్ కనకాల ప్రసాద్ రావు అనే మధ్యతరగతి తండ్రి పాత్రలో కనిపించారు. నటి వసంతిక ఆయన కూతురు స్వాతి పాత్రలో మెరిసింది. ఉద్యోగంలో చేరిన స్వాతి.. ఉన్నట్టుండి ఓ రోజు అదృశ్యం అవుతుంది.

OTT DOPrasadRaoKanabadutaledhu Streaming on ZEE5 Feb 27 Rajeev Kanakala Udaya Bhanu Thriller series

అయితే తన ప్రాణ సమానమైన కూతురు ఏమైందో తెలియక ఆ తండ్రి పడే వేదన.. ఈ మిస్సింగ్ కేసు వెనుక ఉన్న మిస్టరీ ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేస్తాయి. ఇక ఈ సిరీస్ లో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా ఉదయ భాను మెప్పించారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో పాటు ప్రతి కుటుంబానికి కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సిరీస్ ఎట్టకేలకు ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+