పవన్ షాకింగ్ పోస్ట్ ..నా భార్యకు విడాకులిచ్చి చాలా కాలమైంది
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. కలిసి ఉండలేక స్టార్స్ ఇలా విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి.
తమ లైఫ్ పార్టనర్‌తో రాజీ పడకపోవడం అత్తింటి గొడవలు ,పెళ్లి తరువాత కూడా కెరీర్ కొనసాగించడం, పర్సనల్ లైఫ్‌ను మెయిన్‌టైయిన్ చేయడం మొదలగు కారణాలతో సెలబ్రిటీలు విడాకులు బాట పడుతున్నారు. తాజాగా ఓ సీరియల్ నటుడు తన భార్యకు విడాకులు ఇవ్వడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఓ నటితో ఎఫైర్ కారణంగానే అతను తన భార్యకు విడాకులు ఇచ్చారనే వార్త ఇప్పుడు వైరల్ అవుతోంది. ముద్దమందారం సీరియల్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు పవన్ సాయి.

తన నటనతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న పవన్ సాయి..చాలామంది అభిమానులను సంపాదించుకున్నాడు. మధుమిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్న పవన్ సాయికి ఓ బాబు కూడా ఉన్నాడు. తాజాగా అతను తన వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పారు. తన భార్య మధుమితకు విడాకులిచ్చానని పవన్ సాయి తెలిపారు. దీనిపై పవన్ సాయి తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు.
''నా వ్యక్తిగత, వైవాహిత జీవితం గురించి ఏదేదో మాట్లాడుకుంటున్నారు.. వాటన్నింటికీ నేను ఈ రోజు క్లారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాను. నేను మధుమిత ఇద్దరి ఇష్టంతోనే చాలాకాలం క్రితం విడాకులు తీసుకొని విడిపోయాం. ఇప్పుడు మా జీవితాలు మేము బతుకుతున్నాం. ఏదేమైనా సరే ఇప్పటికీ ఒకరికి ఒకరం సపోర్ట్‌గా ఉంటున్నాం. కాబట్టి ఎవరూ దీని గురించి ఆందోళన చెందవద్దు. నేను నా వ్యక్తిగత విషయాలను పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడను. కాబట్టి దయచేసి మా నిర్ణయాన్ని గౌరవిస్తారని ఆశిస్తున్నాను. అంటూ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేశాడు. పవన్ సాయి విడాకులు బుల్లితెరపై హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications