హత్య కేసులో హీరో సంచలన వాగ్మూలం, ఆ రోజు ఏం జరిగిందంటే, ఏ1 గర్ల్ ఫ్రెండ్!

చిత్రదుర్గ కేంద్రంగా, బెంగళూరులో జరిగిన రేణుకాస్వామి హత్య కేసు దర్యాప్తును వేగవంతం చేసిన పోలీసులు కేసు విచారణ ఓ కొలిక్కి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు ఇదే కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్, ఆయన ప్రియురాలు పవిత్రా గౌడతో పాటు నిందితులు ఒక్కొక్కరు ఒక్కో విషయాన్ని పోలీసులకు చెబుతున్నారని వెలుగు చూడటం ఇప్పుడు కర్ణాటకలో హాట్ టాపిక్ అయ్యింది.

ఈ కేసుకు సంబంధించి నిందితులు ఏ-1 పవిత్ర గౌడ, ఏ-2 నటుడు దర్శన్ తో సహా పదిహేను మందికి పైగా నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. ఈ కేసులో ఏ-2 నిందితుడిగా ఉన్న హీరో దర్శన్‌ను కూడా విచారించి అతని వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. ఈ హత్య గురించి తనకేమీ తెలియదని చెప్పిన దర్శన్ కు వ్యతిరేకంగా చాలా సాక్షాలు దొరికిపోయాయని పోలీసులు అంటున్నారు.

Hero Darshan who gave a statement before the police about the Renukaswamy murder case

ఇప్పుడు ఈ ఘటనలో తన పాత్రపై దర్శన్ ఒక్కోసాకి ఒక్కొరంగా వాంగ్మూలాలు ఇస్తున్నట్లు సమాచారం. పోలీసుల ముందు దర్శన్ వాంగ్మూలం ఇస్తున్నారు. నేను రేణుకాస్వామిని కేవలం భయపెట్టానని, నేను హత్య చేయలేదని, అతన్ని హత్య చెయ్యాలని నేను ఎవరికీ చెప్పలేదని హీరో దర్శన్ పోలీసులకు చెప్పాడని తెలిసింది. రేణుకాస్వామి తన స్నేహితురాలు పవిత్రా గౌడకు అశ్లీల మెసేజ్ లు పంపించాడని అతన్ని నేను భయపెట్టానని హీరో దర్శన్ పోలీసులకు చెప్పాడని తెలిసింది

రేణుకాస్వామి అశ్లీల మెసేజ్ లు ఎందుకు చేశాడో తనకు తెలీదని, ఎందుకంటే తనకు సోషల్ మీడియా గురించి పెద్దగా తెలియదని, నా సోషల్ మీడియా ఖాతాను నా బృందం చూసుకుంటుందని హీరో దర్శన్ పోలీసులకు చెప్పాడని తెలిసింది. రేణుకాస్వామిని షెడ్ లో బెదిరించి తాను అక్కడి నుంచి వెళ్లిపోయానని, తరువాత ఏం జరిగిందో నాకు తెలియదని హీరో దర్శన్ పోలీసుల ఎదుట వాంగ్మూలం ఇచ్చాడని తెలిసింది.

రేణుకాస్వామిని బెదిరించిన తరువాత తాను అతనికి డబ్బు ఇచ్చి హోటల్ లో భోజనం చేయాలని, తరువాత చిత్రదుర్గాకు వెళ్లిపోవాలని చెప్పానని హీరో దర్శన్ పోలీసులకు వాగ్మూలం ఇచ్చాడని సమాచారం. ఈ హత్య కేసులో హీరో దర్శన్ తో పాటు నిందితులు అందరిని ఆరు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారిని విచారిస్తున్నారు. అంతకుముందు విచారణలో వాంగ్మూలం ఇచ్చిన నటుడు దర్శన్, పవిత్రకు పవన్ అసభ్యకరమైన సందేశాలు పంపించాడని చెప్పాడని తెలిసింది.

తరువాత తాను రేణుకాస్వామిని తీసుకురావాలని రాఘవేంద్రకు సూచించానని, శనివారం సాయంత్రం రేణుకాస్వామిని షెడ్డులో కలిశానని, పవిత్రకు అసభ్యకరమైన సందేశాలు పంపడం సరైంది కాదని అతన్నిహెచ్చరించానని, ఇంకోసారి ఇలా చెయ్యకూడదని తాను అతన్ని బెదిరించానని హీరో దర్శన్ పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత డబ్బులు ఇచ్చి భోజనం చేసి ఊరు చేరుకోమని చెప్పి తాను ఆ షెడ్డు నుంచి వెళ్లిపోయానని, ఈ హత్య నేను చేయ్యలేదని, ఈ హత్యతో తనకు ఎలాంటి సంబందం లేదని ఈ కేసులో రెండో నిందితుడు దర్శన్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+