నువ్వు త్వరలోనే కుక్క చావు చస్తావ్.. అతనిపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

టాలీవుడ్ హీరోయిన్ మాధవీ లత గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. మాధవీ లత 2007లో మహేష్ బాబు నటించిన "అతిథి" చిత్రంలో హీరోయిన్ స్నేహితురాలి పాత్రలో తొలిసారిగా కనిపించారు.హీరోయిన్‌గా ఆమె మొదటి చిత్రం 2008లో విడుదలైన "నచ్చావులే". ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా మూడు నంది పురస్కారాలను సైతం సొంతం చేసుకుంది.

ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది.ఆ తర్వాత ఆమె "ష్..." (2009) ,నాని సరసన నటించిన "స్నేహితుడా" (2009) చిత్రాల్లో నటించారు, అయితే ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.ఆమె "అరవింద్ 2" (2013)లో నటించారు. తారకరత్నతో కలిసి నటించిన "చూడాలని చెప్పాలని" చిత్రం విడుదల కాలేదు.

ఇందులో ఆమె మూగ , చెవిటి అమ్మాయి పాత్రను పోషించారు. 2015లో ఆమె సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన మల్టీ-స్టారర్ తమిళ చిత్రం "ఆంబల" ద్వారా తమిళంలోకి అడుగుపెట్టారు. ఆమె నటించిన ఇతర చిత్రాలలో "ఉసురు" (2011), "లేడీ" (2020), "మధురై మణికక్కురవర్" (2021) ఉన్నాయి. హీరోయిన్‌గా అనుకున్నంత సక్సెస్ కాకపోవడంతో ఈ భామ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చింది. ఆమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాధవీ లత, సమాజంలో జరుగుతున్న తప్పులపై ఎప్పటికప్పుడు తనదైనశైలిలో స్పందిస్తుంటారు. తాజాగా ఆమె తన సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ వ్యక్తి శివాలయంలో ఉన్న బసవన్నకు నీళ్లతో అభిషేకం చేశాడు. బసవన్నపై కాళ్లు కూడుకోవడం కనిపించింది. ఆ తర్వాత ఆ విగ్రహం మీద ఎక్కి కాళ్లు కడుక్కున్నాడు.

Heroine Madhavi Latha reacts strongly to people who witnessed the attack on a temple

అంతటితో ఆగకుండా దానిమీద టాయిలెట్ కూడా పోశాడు. ఈ వీడియోపై మాధవీ లత రియాక్ట్ అయ్యారు. దీనిపై మాధవీ లత మాట్లాడుతూ.. 'అంటే అన్నామంటారు.. అదే అనకపోతే ఇలాంటివి చేస్తారు. ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నారో' ..ఏం పర్లేదు ఏదో ఒకరోజు రోడ్డు మీద పోతుంటే ఎద్దు వచ్చి కడుపులో పొడిస్తుంది.. అంతే కర్మ అనుభవించాలంటూ ఆమె కామెంట్ చేశారు.ఏం పర్లేదు ఇప్పుడు నవ్వి నోడు, కడుక్కున్నోడు కచ్చితంగా కర్మ ఫలితం అనుభవిస్తారు, ఒకవేళ నీకు తెలియకపోతే నీ పిల్లలకు కూడా తరతరాలుగా కర్మ ఫలితం వెంటాడుతుందంటూ కాస్తా ఘాటుగానే రియాక్ట్ అయ్యారామె. ప్రస్తుతం మాధవీ లత మాట్లాడిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+