ముందు ఆ పని చేయండి..తిరుమల లడ్డు వివాదంపై హీరోయిన్ సంచలన కామెంట్స్
సీఎం చంద్రబాబు తిరుపతి లడ్డు ప్రసాదంపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో అవినీతి చోటు చేసుకుందని.. లడ్డూ తయారీలో నెయ్యికి బదులు జంతువుల ఎముకలతో చేసిన ఆయిల్ ను ఉపయోగించారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో NDDB CALF ఇచ్చిన రిపోర్టు కూడా బయటకు రావడం జరిగింది.
జగన్ ప్రభుత్వ హయాంలో ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB CALF ల్యాబ్ నిర్ధారించిన నివేదికలను టీడీపీ నేతలు బయటపెట్టారు. నివేదికల్లో పొందుపర్చిన అంశాలను ప్రస్తావిస్తూ.. మాజీ సీఎం జగన్‌పై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.లడ్డుల్లో నెయ్యిపై జులై 8, 2024న ల్యాబ్‌కు పంపించగా.. జులై 17వ తేదీన NDDB CALF ల్యాబ్ నివేదిక ఇచ్చిందన్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ వివాదంపై హీరోయిన్ ప్రణీత రియాక్ట్ అయ్యారు. తిరుమల లడ్డూ వివాదంపై హీరోయిన్ ప్రణీత స్పందిస్తూ..సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు."శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం దారుణం.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను.. ఇది స్వామి భక్తులు కలలో కూడా ఊహించనిది" అని అన్నారు.
News of animal fats being used in the preparation of Srivari laddu is nothing short of sacrilege. I hope the strictest action will be ensured against the perpetrators.
— Pranitha Subhash (@pranitasubhash) September 19, 2024
This is unimaginable to Sri Venkateswara bhaktas!
వాస్తవానికి ప్రణీత రెగ్యులర్ గా మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువల గురించి సోషల్ మీడియాలో పలు పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తాజాగా తిరుమల లడ్డూపై నడుస్తున్న వివాదంపైనా స్పందించారు. కరోనా సమయంలో కర్ణాటకకు చెందిన బిజినెస్‌మ్యాన్ నితిన్ రాజును ప్రణీత వివాహం చేసుకుంది. ఇటీవలే ఈ బ్యూటీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్‌మీడియాలో తన ఖాతాలో కూడా పోస్ట్ చేశారామె. ప్రణీతకు ఇంతకు ముందే ఓ పాప పుట్టింది.












Click it and Unblock the Notifications