మోహన్ బాబు ఇంటివద్ద హైటెన్షన్.. గేటు బయటే మనోజ్, భారీగా పోలీసులు
మంచు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి రోడ్డెక్కింది. ఇన్నాళ్లు అంతా సర్దుమనిగింది అని భావించగా ఇప్పుడు మళ్లీ మంచు మనోజ్.. విష్ణుపై ఫిర్యాదు చేయడంతో మళ్లీ భగ్గుమంది. ఈ క్రమంలోనే ఈరోజు తన కుటుంబంతో కలిసి మోహన్ బాబు జల్‌పల్లి నివాసం వద్దకు మంచు మనోజ్ చేరుకోవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే మనోజ్ ను ఇంట్లోకి అనుమతించక పోవడంతో గేటు బయటే కూర్చున్నారు. ఇంట్లోకి వెళ్లేందుకు కోర్టు అనుమతించిందని మనోజ్ చెబుతున్నారు.
ఈ క్రమంలోనే జల్ పల్లిలోని ఇంటి వద్ద గొడవ జరిగే అవకాశం ఉండటంతో... పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఎలాంటి గొడవలు జరగకుండా 100 మంది పోలీసులతో భారీ బందోబస్తు చేపట్టారు. మోహన్ బాబు నివాసానికి కిలోమీటర్ దూరంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసి.. బయట వ్యక్తులను ఎవరిని కూడా టౌన్ షిప్ లోకి పోలీసులు అనుమతించడం లేదు. అలానే పరిసర ప్రాంతాల్లో సైతం ఆంక్షలు విధించారు.

ఇక నిన్న మనోజ్ హైదరాబాద్ నార్సింగి పోలీసులను ఆశ్రయించాడు. ఏకంగా 150 మంది తన ఇంట్లో చొరబడ్డారని.. తన కార్లతో పాటు వ్యక్తిగత వస్తువులు కూడా ఎత్తుకుపోయారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అందుకు కారణం తన సోదరుడు మంచు విష్ణు అంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. తన కూతురు బర్త్ డే వేడుకల కోసం రాజస్థాన్‌కు వెళ్లగా.. విష్ణు ఇంట్లోకి ప్రవేశించి రచ్చ చేశారని మంచు మనోజ్ పోలీసుల ముందు వాపోయారు. తమ ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై తండ్రి మోహన్‌బాబుతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నా అందుబాటులోకి రావడం లేదన్నారు.
మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత. నా ఇంట్లోకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారు - మంచు మనోజ్#MohanBabu #ManchuManoj #ManchuVishnu #Tollywood #OITelugu pic.twitter.com/ydwNlEm3f7
— oneindiatelugu (@oneindiatelugu) April 9, 2025












Click it and Unblock the Notifications