ద్రోణి ప్రభావంతో వర్షాలు- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!!
మరోసారి వర్షాల పై బిగ్ అలర్ట్ జారీ అయింది. రుతుపవనాలు వచ్చినా ఆశించిన స్థాయిలో వర్షాలు పడటం లేదు. జూన్ నెల నామమాత్రంగానే వర్షాలు కురిసాయి. జూలై తొలి వారంలో రైతుల ఆశలు ఫలించలేదు. ఈ సమయంలో ద్రోణి కారణంగా అక్కడక్కడా వర్షాలు పడినా .. పలు ప్రాంతాల్లో ఉక్కపోత వాతావరణం నెలకొంది. తాజాగా ఐఎండీ వచ్చే రెండు రోజుల పాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.
ఎన్‌నివో ప్రభావంతో ఈ సారి లోటు వర్షపాతం నమోదవుతుందని వాతావరణశాఖ ముందే అంచనా వేసింది. కాగా, ప్రస్తుతం తెలంగాణ నుండి కర్ణాటక తీరానికి ఆనుకుని ఉన్న తూర్పు మధ్య అరేబియా సముద్రం వరకు ఉన్న ద్రోణి బలహీన పడింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ అంచనా వేసింది. రాబోయే మూడ్రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు లేదా జల్లులు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.

రెండు రోజుల పాటు వర్షాలు
ఇక, ఏపీలోనూ పలు జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. వచ్చే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులతో కూడిన భారీ వానలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. విజయనగరం, భోగాపురం, రణస్థలం పరిసర ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన తెలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కాకినాడ ,కోనసీమ ,తూర్పుగోదావరి జిల్లాల్లో ఒకటి,రెండు చోట్ల పిడుగులతో తేలికపాటి వర్షాలు ఈదురుగాలులు వీస్తాయని, అప్రమత్తంగా ఉండాలని వాతవారణశాఖ ఈ జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది.













Click it and Unblock the Notifications