బిగ్ షాక్.. సడెన్ గా పెట్రోల్ రేట్లు పెంపు.. లీటర్ పెట్రోల్ పై రూ. 13 బాదుడు
ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్- అమెరికా మధ్య తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయి. ఇరాన్ లో ఖమేనీ అంత్యక్రియలు, ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్.. అదే జరిగితే ఇరాన్ ను బూడిద చేయాలని అమెరికా సైన్యానికి ట్రంప్ ఆదేశాలు.. ఇలా వరుస సంఘటనలతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హార్మూజ్ జలసంధిపై ఆంక్షల నేపథ్యంలో ప్రపంచ దేశాలు అప్రమత్తం అయ్యాయి. ఈ క్రమంలో అసలే ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న పాకిస్థాన్ యుద్ధ ప్రభావం నుంచి తప్పించుకునేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
ఈ క్రమంలో మరోసారి భారీగా పెట్రోల్, డీజిల్ రేట్లను పెంచేసింది. లీటర్ పెట్రోల్ పై ఏకంగా రూ. 13.18 పెంచింది. దాంతో ప్రస్తుతం పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 310.71 పాకిస్థాన్ రూపాయలుగా ఉంది. హై స్పీడ్ డీజిల్ లీటర్ ధర రూ. 323.30 పాకిస్థాన్ రూపాయలుగా ఉంది. ఈ సవరించిన ధరలు జూలై 12 నుంచి అమల్లోకి రానున్నట్లు స్పష్టం అవుతోంది. ఈ విషయాల్ని పాకిస్థాన్ కు చెందిన డాన్ పత్రిక తెలిపింది. అయితే గత వారమే పాకిస్థాన్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ రేట్లను తగ్గించింది. కానీ ప్రస్తుతం పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో సడెన్ గా పెట్రోల్, డీజిల్ రేట్లను పాకిస్థాన్ ప్రభుత్వం పెంచేసింది. ఈ మేరకు పెట్రోలియం డివిజన్ ఆదేశాలు జారీ చేసింది.
లీటర్ పెట్రోల్ పై రూ. 13.18 పెంచడంతో ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర రూ. 310.71 గా ఉంది. అలాగే హై స్పీడ్ డీజిల్ ధర కూడా లీటర్ పై రూ. 13.80 పెంచడంతో లీటర్ డీజిల్ ధర రూ. 323.30 గా ఉంది. సవరించిన ఈ ధరలు జూలై 12 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే గతవారమే పాకిస్థాన్ పెట్రోల్, డీజిల్ ధరను లీటర్ పై రూ. 1.97 మేర తగ్గించింది. దాంతో గతవారం లీటర్ పెట్రోల్ ధర రూ. 297.53 గా ఉంది. లీటర్ డీజిల్ ధర రూ. 309.50 గా ఉంది. ఇక తాజాగా మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఫిబ్రవరి 28న ప్రారంభం అయ్యాయి. ఆ సమయంలో పాకిస్థాన్ లో చమురు సంక్షోభం కారణంగా మినీ లాక్ డౌన్ ప్రకటించింది. రాత్రి 8 గంటలకే షాపులు, కార్యాలయాలు మూసివేయాలని ఆదేశించింది. అలాగే పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలు కూడా మూతబడ్డాయి. ఆ సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ లో పాకిస్థాన్ లో లీటర్ పెట్రోల్ ధర ఏకంగా రూ. 450 దాటింది. అదే నెలలో ఓసారి లీటర్ పెట్రోల్ ధర రూ. 520 వరకూ వెళ్లింది. ఇదే ఆల్ టైమ్ అత్యధికం.. ఇక ఇప్పుడిప్పుడే ధరలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో మరోసారి పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగడం అక్కడి ప్రజలను ఆందోళన కలిగిస్తోంది.












Click it and Unblock the Notifications