చెన్నై మెట్రోలో సీఎం విజయ్.. టిక్కెట్టు కొని ప్రయాణం.. వీడియో వైరల్
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ చెన్నై మెట్రోలో సందడి చేశారు. మెట్రో పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. మెట్రో టికెట్ తీసుకుని రైలు ఎక్కిన విజయ్ ప్రయాణికులతో సరదాగా ముచ్చటించారు. ఈ మేరకు ప్రజా రవాణాపై అక్కడి అధికారులతో సమీక్ష జరిపారు. అయితే మెట్రో స్టేషన్ లో విజయ్ చూసిన ఫ్యాన్స్, ప్రయాణికులు ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం విజయ్ కు హాయ్ చెప్తూ, విజిల్స్ వేస్తూ కేరింతలు కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Chief Minister Joseph Vijay Arrived Nandhanam Metro Station pic.twitter.com/1ZmQRAqGIp
— Vignesh Theni (@Vignesh_twitz) July 29, 2026
సీఎం విజయ్ అధికారులతో కలిసి ఒమందురార్ మెట్రో స్టేషన్ కు బుధవారం మధ్యాహ్నం చేరుకున్నారు. సాధారణ ప్రయాణికుల మాదిరిగానే లైనులో నిల్చుని మెట్రో రైలు టికెట్ తీసుకున్నారు. చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ హెడ్ క్వార్టర్స్ ఉన్న నందనమ్ స్టేషన్ మెట్రో రైలు ఎక్కారు. అయితే మెట్రో స్టేషన్ లో ఒక్కసారిగా విజయ్ ను చూసిన ఫ్యాన్స్ కేరింతలు కొడుతూ విజయ్ ను తమ సెల్ ఫోన్స్ లో ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. అలాగే నేరుగా మెట్రో రైలులోకి ప్రవేశించిన విజయ్ ను లోపల ఉన్న ప్రయాణికులు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు.

మెట్రో రైలులోని ప్రయాణికులతో సీఎం విజయ్ సరదాగా సంభాషించారు. ప్రయాణం, సౌకర్యం, భద్రత తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. విజయ్ ను చూడగానే ఓ మహిళ ఆశ్చర్యానికి గురై ఆయన చేతిని ముద్దాడారు. అలాగే ఓ వికలాంగుడు విజయ్ ను హత్తుకున్నాడు. ఇక విజయ్ రాకతో ఒమందురార్ మెట్రో స్టేషన్ మొత్తం ఫ్యాన్స్ తో కిక్కిరిసిపోయింది. వారికి హాయ్ అని చేతులు ఊపుతూ విజయ్ ముందుకు సాగారు. అధికారులు అందించిన సమాచారం ప్రకారం.. పోరూర్- పూనమల్లీ కారిడార్ పనులను విజయ్ సమీక్షించినట్లు స్పష్టం అవుతోంది. కత్తిపారా జంక్షన్ మెట్రో పనులను కూడా వీక్షించారు.












Click it and Unblock the Notifications