ఎస్ఐఆర్ వివాదం వేళ.. ఈసీ జ్ఞానేష్ కుమార్ కలెక్టర్ కుమార్తె చుట్టూ దుమారం

గౌతమ్ బుద్ధ నగర్ జిల్లా కలెక్టర్ మేధా రూపం చిక్కుల్లో పడ్డారు. ఆమె వ్యవహారం చిలికి చిలికి గాలీవానగా మారింది. వివాదం రేపుతోంది. చివరికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికీ వెళ్లింది. అలహాబాద్ హైకోర్టు తనపై విధించిన అయిదు లక్షల రూపాయల జరిమానా ఆదేశాలను కొట్టివేయించుకునే విషయంలో మేధా రూపం ప్రత్యేకంగా మినహాయింపులను పొందారనే ఆరోపణలు మేధా రూపంపై వెల్లువెత్తుతున్నాయి.

మేధా రూపం ఆదేశాల మేరకు విద్యార్థిని, సామాజిక కార్యకర్త ఆకృతి చౌదరిని ఏకంగా జాతీయ భద్రతా చట్టం కింద అదుపులోకి తీసుకోవడాన్ని ఇదివరకు అలహాబాద్ హైకోర్టు తప్పుపట్టింది. ఉన్నతాధికారుల ఏకపక్ష ధోరణిపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితురాలికి అయిదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని మేధా రూపం, ఈ కేసులో సంబంధం ఉన్న పోలీస్ అధికారుల జీతాల నుంచి రికవరీ చేయాలని తీర్పు ఇచ్చింది.

Lawyers Association Writes to CJI Surya Kant Over Alleged Special Listing of DM Medha Roopam Plea

జస్టిస్ అతుల్ శ్రీధరన్, జస్టిస్ అచల్ సచ్‌దేవ్‌తో కూడిన ధర్మాసనం ఈ నెల 7వ తేదీన ఈ తీర్పును వెలువడించింది. అధికారుల వైఖరి, నిరంకుశ ప్రవర్తన వల్ల ఉత్తరప్రదేశ్.. భవిష్యత్తులో నియంతృత్వ రాజ్యంగా భీతావహ వాతావరణం కలిగిన ఆర్వెలియన్ డిస్టోపియాగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. తగిన ఆధారాలు లేకుండానే ఆకృతి చౌదరిని జైలులో ఉంచడం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఆమె ప్రాథమిక హక్కును హరించినట్లయిందని స్పష్టం చేసింది.

ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి: రైలు ప్రయాణంలో ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం
ఈ దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి: రైలు ప్రయాణంలో ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

ఈ తీర్పుపై మేధా రూపం అప్పీల్ కు వెళ్లారు. సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. హైకోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందులో ఇంప్లీడ్ అయింది. వాదనల సమయంలో యూపీ సర్కారు తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, మేధా రూపం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా తమ వాదనలను వినిపించారు. ఎన్‌ఎస్‌ఏ వంటి కఠిన చట్టాల ప్రయోగం ఒక్క కలెక్టర్ నిర్ణయం వల్లే జరగదని, పలువురు పోలీస్ ఉన్నతాధికారులు సమర్పించిన పటిష్ట ఆధారాల మేరకే నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

పసిడికి అమాంతం పెరిగిన గిరాకీ- దెబ్బకు.. !!
పసిడికి అమాంతం పెరిగిన గిరాకీ- దెబ్బకు.. !!

కలెక్టర్ స్థాయి అధికారులు ఎప్పుడు కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరని, క్షేత్రస్థాయిలో పాలన అధికారులు, పోలీస్ యంత్రాంగం ఇచ్చిన రిపోర్టుల ఆధారంగా చర్యలు ఉంటాయని వారు వివరించారు. ఈ వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకుంది. నిర్ణయం తీసుకునే ప్రక్రియలో వేర్వేరు ఉన్నతాధికారుల ప్రమేయం ఉన్నప్పుడు జిల్లా మేజిస్ట్రేట్‌ను మాత్రమే బాధ్యురాలిని చేయలేమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ స్పష్టం చేశారు. అయిదు లక్షల రూపాయల పరిహార మొత్తం చెల్లింపుపై తదుపరి విచారణ పూర్తయ్యే వరకు స్టే ఇచ్చారు.

తిరుపతిలో మరో రెండు టీటీడీ భారీ వసతి భవనాలు
తిరుపతిలో మరో రెండు టీటీడీ భారీ వసతి భవనాలు

సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం.. ఇప్పుడు తాజా వివాదానికి కేంద్రబిందువు అయింది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ కుమార్తె కావడం వల్ల మేధా రూపం పిటీషన్ ఓ ప్రత్యేక బెంచ్ వద్ద లిస్ట్ అయిందనే విమర్శలు తలెత్తుతున్నాయి. ప్రస్తుత రోస్టర్ కు విరుద్ధంగా ఒక ప్రత్యేక బెంచ్‌కు కేటాయించడంపై అభ్యంతరాలు వ్యక్తమౌతోన్నాయి. ఇందులో లాయర్స్ అసోసియేషన్ ఫర్ కాన్స్ స్టిట్యూషన్ జోక్యం చేసుకుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌కు లేఖ రాసింది.

మేధా రూపం విషయంలో సుప్రీంకోర్టు బెంచ్ ఇచ్చిన తీర్పు.. న్యాయవ్యవస్థ నిష్పాక్షికతపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని సడలించేలా ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వివాదానికి ప్రధాన కారణమైన మేధా రూపం కుటుంబ నేపథ్యమే దీనికి ప్రధాన కారణమని పేర్కొంది. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కుమార్తె కావడం వల్లే ఈ పిటిషన్ విచారణలో ప్రత్యేక ప్రాధాన్యత లభించిందని తన లేఖలో స్పష్టంగా పేర్కొంది. సాధారణంగా కోర్టులో నిర్ణీత రోస్టర్ పద్ధతి ప్రకారం కేసులు విచారణకు రావాల్సి ఉండగా, ఇందులో ఈ నిబంధనలేవీ పాటించలేదని తెలిపింది.

ఈ కేసు విచారణ సాగుతున్న సమయంలో ముఖ్యాంశాలు బయటకు రాకుండా కోర్టు లైవ్ స్ట్రీమింగ్ ఆడియోను నిలిపివేయడం, మ్యూట్ చేయడంపై కూడా న్యాయవాదుల సంఘం ప్రశ్నలు లేవనెత్తింది. పారదర్శకతను పెంచడానికి ప్రవేశపెట్టిన లైవ్ స్ట్రీమింగ్ ను ఇలాంటి కేసులలో నియంత్రించడం ఆందోళనకరమని పేర్కొంది. ఉన్నతాధికారుల వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయ పరిపాలన యంత్రాంగం నిబంధనలను సడలిస్తోందనే భావన కలగకుండా చూడాలని సుప్రీంకోర్టును కోరింది.

ఈ వ్యవహారంపై కాక్రోచ్ జనత పార్టీ కో కన్వీనర్ సౌరవ్ దాస్ కూడా స్పందించారు. ఈ స్టే ఇచ్చిన జస్టిస్ సతీష్ చంద్ర శర్మ మరో రెండు నెలల్లో పదవీ విరమణ కాబోతోన్నారని గుర్తు చేశారు. గతంలో కూడా కొన్ని వివాదాస్పదంగా వ్యవహరించారని, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియ చట్టం చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సమయంలో ప్రభుత్వం నిర్ణయాన్ని సమర్థించేలా తీర్పు ఇవ్వడంతో ఈ కేసులో స్ప్లిట్ వర్డిక్ట్ వచ్చిందని గుర్తు చేశారు.

ఆయన కుమారుడు పలు ప్రభుత్వ ప్యానెల్ లాయర్‌గా సేవలు అందిస్తోన్నారని సౌరవ్ దాస్ పేర్కొన్నారు. ఆదాయపు పన్ను, జీఎస్టీ, కస్టమ్స్, ఎక్సైజ్ శాఖలతో పాటు మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆయన కుమారుడు దాదాపు నాలుగు ప్రతిష్టాత్మక ప్యానెళ్లలో సభ్యుడిగా ఉన్నారని చెప్పారు. పదవీ విరమణకు కొద్దిరోజుల ముందే ఇలాంటి కీలక బాధ్యతల్లో కుటుంబ సభ్యులు ఉండటం నైతికత కాదని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు నిర్దేశించిన నైతిక నియమావళి ప్రకారం న్యాయమూర్తులు రాజకీయాలు, ప్రభుత్వాలకు దూరంగా ఉంటూ నిష్పాక్షికంగా వ్యవహరించాలి. తమ కుటుంబ సభ్యుల ద్వారా లబ్ధి పొందుతున్నారనే ఆరోపణలు వచ్చినప్పుడు, వారు ఆ కేసుల నుంచి తప్పుకోవడం నైతిక సంప్రదాయం. తాజా పరిణామాలు దేశ న్యాయవ్యవస్థ స్వేచ్ఛ, పారదర్శకతపై సామాన్య ప్రజల్లో విశ్వాసాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని సౌరవ్ దాస్ ఆందోళన వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+