కరువు తీరా, ప్రాజెక్టులకు జలకళ - ఎల్‌నినో ప్రభావానికి చెక్‌..!!

తీవ్ర వాయుగుండం తో కరువు తీరా వర్షాలు కురిసాయి. భారీ వర్షాలతో రాష్ట్రంలోని పలు జిల్లాలు తడిసి ముద్దయ్యాయి. ఎల్‌నినో ప్రభావానికి చెక్‌ పెడుతూ పంటలకు ప్రాణం పోసాయి. జలాశయా ల్లోకి తిరిగి వరద ప్రవాహాలు చేరుతున్నాయి. కొన్ని జిల్లాల్లో ఈ భారీ వర్షాలతో కొంత మేర నష్టం జరిగినా... రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేరుతోంది. ఇసుక బయటపడిన ప్రకాశం బ్యారేజీకి రెండు రోజులుగా వచ్చిపడుతున్న వరదను సముద్రంలోకి వదులుతున్నారు.

తీవ్ర వాయుగుండం తీరం దాటే సమయంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసాయి. అడుగంటి న జలాశయాల్లోకి తిరిగి వరద ప్రవాహాలు చేరుతున్నాయి. ముడసర్లోవ, గంభీరం, మేహాద్రిగెడ్డ రిజర్వాయర్లలోకి భారీగా నీరు చేరుతోంది. ఇసుక బయటపడిన ప్రకాశం బ్యారేజీకి వస్తున్న వరద ను సముద్రంలోకి వదిలేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో, మరి కొన్ని చోట్ల వరి పంట ముంపునకు గురైంది. చాలా చోట్ల రోడ్లపై భారీ వృక్షాలు కూలిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు విరిగిపడ్డాయి. మొక్కజొన్న 459.5 హెక్టార్లు, పత్తి 95 హెక్టార్లలో ముంపునకు గురైంది. గెలలతో ఉన్న అరటి చెట్లు విరిగిపడ్డాయి.విశాఖలోని ఎండాడలో 280 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలుచోట్ల కొండ చరియలు జారిపడ్డాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. అనకాపల్లి జిల్లాలో చెరువులు, కుంటలు వర్షపు నీటితో నిండిపోయాయి.

 TTD: కొత్త సదుపాయాలు ప్రారంభం, అలిపిరి కేంద్రంగా ఇక - ఛైర్మన్ బీఆర్ నాయుడు..!!
TTD: కొత్త సదుపాయాలు ప్రారంభం, అలిపిరి కేంద్రంగా ఇక - ఛైర్మన్ బీఆర్ నాయుడు..!!
deep-depression-crosses-ap-coast-near-kalingapatnam-extremely-heavy-rain-disrupts-life-in-north-co

తగ్గిన వర్షపాత లోటు

కాగా, విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో అత్యధికంగా 18.1సెంటీమీటర్ల వర్షం నమోదయ్యింది. 1,700 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో పత్తి పంట మునిగిపోయింది. 129 విద్యుత్‌ స్తంబాలు నేలకొరిగాయి. 31 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. ఇక.. వర్షాలతో కాకినాడ జిల్లా తడిచి ముద్దయింది. అత్యధికంగా జగ్గంపేటలో 15 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కాకినాడ నగరంలో ఆర్టీసీ బస్టాండ్‌ మునిగిపోయింది. ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారి, రాకాసి అలలు ఎగసిపడ్డాయి. జిల్లావ్యాప్తంగా 8,042 ఎకరాల్లో వరి పంట నీటమునిగింది. సుద్దగడ్డకు వరద పోటెత్తడంతో పిఠాపురం నియోజకవర్గంలో 2,700 ఎకరాలు నీటమునిగాయి. ఏలేరు వరద ముప్పు నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా సగటు వర్షపాతం 114.7గా నమోదైంది. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో కొండవాగులు పొంగుతున్నాయి. ఎర్రకాలువ, పోగొండ, జల్లేరు జలాశయాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో రెండు రోజుల్లో దాదాపు 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తాజాగా కురిసిన వర్షాలతో లోటు 34.5 శాతానికి తగ్గింది. ఈ రోజు కూడా వర్షాలు కొనసాగనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+