రేపటిలోగా CEC తప్పుకోకపోతే ?-ఈసారి డేట్, ప్లేస్ కూడా చెప్పేసిన కాక్రోచ్ లు..!

కేంద్ర ఎన్నికల సంఘంలో సీఈసీ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) ఏకపక్ష ధోరణులు, మిగతా కమిషనర్లను లెక్కచేయకుండా నిర్ణయాలు తీసుకోవడం, సర్ ప్రక్రియ సందర్బంగా జరిగిన అక్రమాల నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ఉద్యమానికి సిద్దమవుతోంది. గతంలో నీట్ అక్రమాలపై ఢిల్లీలో ఉద్యమం చేసి ధర్మేంద్ర ప్రధాన్ తో కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయించిన కాక్రోచ్ లు.. ఈసారి సీఈసీ జ్ఞానేష్ తో అదే పని చేయించేందుకు నిన్న 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. ఇది కాస్తా రేపటితో పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో కాక్రోచ్ బాస్ అభిజీత్ దిప్కే మరో కీలక ప్రకటన చేశారు.

మోడీ ఏరికోరి తెచ్చుకున్న ఈసీ కమిషనర్ల తిరుగుబాటు ? ఎవరీ సంధూ, వివేక్ జోషీ..?
మోడీ ఏరికోరి తెచ్చుకున్న ఈసీ కమిషనర్ల తిరుగుబాటు ? ఎవరీ సంధూ, వివేక్ జోషీ..?

ఎన్నికల సంఘంలో చోటు చేసుకుంటున్న ఘటనలపై ఇండియన్ ఎక్స్ ప్రెస్ కథనం నేపథ్యంలో దేశవ్యాప్తంగా సీఈసీ జ్ఢానేష్ కుమార్ పై విమర్శలు పెరుగుతున్నాయి. దీంతో ఆయన తక్షణం రాజీనామా చేయాలంటూ నిన్న కాక్రోచ్ జనతా పార్టీ నేతలు ప్రెస్ మీట్ పెట్టి డిమాండ్ చేసారు. అంతటితో ఆగకుండా జ్ఞానేష్ రాజీనామాకు 48 గంటల అల్టిమేటం ఇచ్చారు. అప్పటిలోగా ఆయన తప్పుకోకపోతే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దీంతో కాక్రోచ్ ల అల్టిమేటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది.

CJP Sets Deadline for Gyanesh Kumar s Resignation Announces Nationwide Protest From October 2
Breaking: 48 గంటల్లో సీఈసీ రాజీనామా- తేడా వస్తే దేశవ్యాప్త ఉద్యమం- కాక్రోచ్ అల్టిమేటం..!
Breaking: 48 గంటల్లో సీఈసీ రాజీనామా- తేడా వస్తే దేశవ్యాప్త ఉద్యమం- కాక్రోచ్ అల్టిమేటం..!

ఈ గడువు రేపటితో ముగియనున్న నేపథ్యంలో ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ జాతీయ కన్వీనర్ అభిజీత్ దిప్కే ట్వీట్ చేశారు. జ్ఞానేష్ కుమార్ రేపటిలోగా రాజీనామా చేయకపోతే, సీజేపీ అక్టోబర్ 2న ముంబై నుండి దేశవ్యాప్త నిరసనను ప్రారంభించి, దానిని భారతదేశంలోని వివిధ నగరాలకు విస్తరిస్తుందని దిప్కే హెచ్చరించారు. ఈ గాంధీ జయంతి నాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందామని ప్రతిజ్ఞ చేద్దామని ఆయన పిలుపునిచ్చారు. దీన్ని బట్టి చూస్తే సీఈసీ రాజీనామా అంశంపై సీజేపీ నేతలు ధర్మేంద్ర ప్రధాన్ ఎపిసోడ్ తరహాలో సీరియస్ గానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సీఈసీ వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్న విపక్షాలు ఆయనపై పార్లమెంట్ లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్దం చేస్తున్నాయి. ఈ మేరకు వచ్చే వారం కాంగ్రెస్ పార్టీ నోటీసులు కూడా ఇవ్వబోతోంది. ఇలాంటి సమయంలో కాక్రోచ్ ల ఆందోళన కూడా ప్రారంభమైతే కేంద్రానికి కూడా జంతర్ మంతర్ తరహాలో ఇబ్బందులు తప్పవని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+