నవ్విద్దామని వస్తే.. స్టేజ్‌పైనే కాలర్ పట్టుకున్న ప్రొఫెసర్!: Viral video

చదువు చెప్పే గురువు దైవంతో సమానం అంటారు. కానీ, కొన్నిసార్లు క్షణికావేశంలో జరిగే పరిణామాలు ఆ గౌరవాన్ని ప్రశ్నార్థకం చేస్తుంటాయి. గుజరాత్‌లోని ప్రముఖ నిర్మ యూనివర్సిటీలో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూనివర్సిటీలో ఇటీవల ఘనంగా నిర్వహించిన టెక్నోఫోరా వార్షిక వేడుకల్లో భాగంగా స్టాండప్ కామెడీ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అయితే, కార్యక్రమం సాగుతున్న సమయంలో ప్రేక్షకుల నుంచి ఒక విద్యార్థి చేసిన సరదా కామెంట్ ఏకంగా వేదికపై ఉన్న ప్రొఫెసర్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

స్టాండప్ కామెడీ షో జరుగుతున్న సమయంలో ప్రేక్షకులలో ఉన్న ఒక విద్యార్థి బాలీవుడ్ సినిమాలోని "జల్దీ బోల్, కల్ సుబహ్ పన్వెల్ నికల్నా హై" అనే పాపులర్ డైలాగ్‌ను గట్టిగా అరిచాడు. ఈ వ్యాఖ్య నేరుగా వేదికపై ఉన్న ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన హెచ్‌ఓడీ డాక్టర్ హిమాన్షు కె. పటేల్‌ను ఉద్దేశించి చేసినట్లుగా అక్కడి వాతావరణం మారిపోయింది. దీంతో ఆగ్రహం కట్టలు తెంచుకున్న ప్రొఫెసర్ పటేల్, సదరు విద్యార్థిని వెంటనే వేదికపైకి పిలిపించారు. భయపడుకుంటూ స్టేజ్ పైకి వచ్చిన ఆ విద్యార్థిని అందరి ముందే కాలర్ పట్టుకున్నారు. దీంతో సరదా సీన్ కాస్త హైటెన్షన్ సీన్ గా మారిపోయింది.

Viral Video Shows Nirma University Professor Seizing Student By Collar On Stage During Annual Fest

సీరియస్ వార్నింగ్ ఇచ్చిన ప్రొఫెసర్..

వేదికపై విద్యార్థి కాలర్ పట్టుకున్న ప్రొఫెసర్ పటేల్ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. యూనివర్సిటీ అధ్యాపకులను కించపరిస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని, తాను ఏ స్థాయికైనా వెళ్లగలనంటూ ఆయన హెచ్చరిస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది. అక్కడున్న తోటి విద్యార్థులు దీన్ని తమ మొబైళ్లలో రికార్డు చేయడంతో క్షణాల వ్యవధిలోనే ఈ దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. మూడు రోజుల పాటు అట్టహాసంగా సాగాల్సిన ఈ సాంకేతిక వేడుకల్లో ఈ ఒక్క ఘటన పెద్ద మచ్చలా మిగిలింది.

సోషల్ మీడియాలో రెండుగా చీలిపోయిన నెటిజన్లు..

ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఉపాధ్యాయుడు హోదాలో ఉండి అందరి ముందే స్టేజ్ పై కాలర్ పట్టుకోవడం హేయమైన చర్య అని కొందరు మండిపడుతుండగా, గురువుల పట్ల విద్యార్థులు కూడా హుందాగా ప్రవర్తించాలని, ఆ డైలాగ్ వేయడం సరికాదని మరికొందరు వాదిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (NSUI) తీవ్ర నిరసనలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. సుదీర్ఘ అనుభవం, అనేక పురస్కారాలు ఉన్న సీనియర్ ప్రొఫెసర్ ఇలా బహిరంగంగా ప్రవర్తించడం పట్ల యూనివర్సిటీ వర్గాల్లోనూ విస్మయం వ్యక్తమవుతోంది. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మధ్య ఉండాల్సిన హద్దులు ఎక్కడ దాటకూడదనే చర్చకు ఈ ఉదంతం తెరలేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+