నెతన్యాహుకు ఐరాసలో షాక్..! హేళనలు, బాయ్ కాట్..!
ఇరాన్ సహా పశ్చిమాసియా దేశాలతో ఇజ్రాయెల్ కొనసాగిస్తున్న వైరం, దాడులు, ప్రతిదాడుల నేపథ్యంలో అంతర్జాతీయంగా ఒంటరైన ఇజ్రాయెల్ కు ఇవాళ ఐక్యరాజ్యసమితిలో మరో అవమానం ఎదురైంది. ఐరాస సాధారణ సభను ఉద్దేశించి ప్రసంగించేందుకు ఇవాళ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు (Netanyahu) రాగానే .. వివిధ దేశాల ప్రతినిధులు ఒక్కసారిగా సీట్ల నుంచి లేచి వెళ్లిపోయారు. దీంతో నెతన్యాహు ఒక్కసారిగా షాకయ్యారు. ఆ తర్వాత వారిపై విమర్శలకు దిగారు.
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ఇవాళ మాట్లాడేందుకు వేదికపైకి వచ్చారు. దీంతో ఆయన ప్రసంగాన్ని నిరసిస్తూ చాలా దేశాలకు చెందిన ప్రతినిధులు సీట్లలో నుంచి వెళ్లిపోవడం ప్రారంభించారు. వారిని ఆపేందుకు కూడా ఎవరూ ప్రయత్నం చేయలేదు. దీంతో మూకుమ్మడిగా వాళ్లంతా సభా హాలులో నుంచి వెళ్లిపోవడం కనిపించింది. అనంతరం చాలావరకు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వాటి ముందే నెతన్యాహు తన ప్రసంగం ప్రారంభించారు.
నెతన్యాహు తన ప్రసంగంలో, లెబనాన్‌లో ఇరాన్ మద్దతున్న హిజ్బుల్లా దళాలకు వ్యతిరేకంగా 2024 సెప్టెంబర్‌లో ఇజ్రాయెల్ జరిపిన ఆపరేషన్‌ను గుర్తుచేశారు.

UN delegates walk out of Netanyahu speech.
— ユキオ・フリーズ (@yukiofriz) September 25, 2026
Mass walkout by:
Afghanistan
Algeria
Angola
Antigua and Barbuda
Bangladesh
Barbados
Bolivia
Bosnia and Herzegovina
Botswana
Brazil
Brunei Darussalam
Central African Republic
Chad
Chile
Colombia
Comoros
Cuba
Democratic Republic of the… pic.twitter.com/hvcG1K922f
గత మూడేళ్లలో ఇజ్రాయెల్ సైనికులు ఏడు రంగాలలో యుద్ధం చేశారని నెతన్యాహు తెలిపారు. న్యూజెర్సీ పరిమాణంలో ఉన్న మరేదైనా దేశం మూడేళ్లపాటు ఏడు రంగాలలో పోరాడగలదని మీకు తెలుసా అని అక్కడ మిగిలిన వారిని నెతన్యాహు ప్రశ్నించారు. తర్వాత ఇరాన్ నాయకుల నుండి న్యూయార్క్ మొదటి ముస్లిం మేయర్ జోహ్రాన్ మమ్దానీ, బ్రిటన్, ఫ్రాన్స్, టర్కీల వరకు అందరిపైనా నెతన్యాహు విమర్శలు గుప్పించారు. ప్రత్యర్థులు తమను భూమిపై నుండి తుడిచిపెట్టడానికి కుట్ర పన్నారని, తాము కుప్పకూలిపోకుండా, గొప్ప అమెరికన్ మిత్రులతో కలిసి వారందరికీ తీవ్రమైన దెబ్బలు ఇచ్చి, ఇరాన్ సైన్యాన్ని, దాని అణు సౌకర్యాలను అణచివేశామన్నారు. ఇజ్రాయెల్ రక్తపాతంపై నెతన్యాహు వ్యాఖ్యలకు హేళనలు ఎదురయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డజన్ల కొద్దీ రాయబారులు నిరసనగా ఆయనను హేళన చేస్తూ, బయటకు వెళ్లిపోయారు. దీంతో నెతన్యాహు.. ఈ హాలును విడిచి వెళ్ళని నైతిక పిరికివాళ్ళు ఇంకెవరైనా ఉంటే, దయచేసి ఇప్పుడే వెళ్ళండి అంటూ విమర్శించారు.














Click it and Unblock the Notifications
