నవ్వి నవ్వి సచ్చిపోతే ఎవరిదండీ బాధ్యత?
టాలీవుడ్ స్టారో హీరో నాగచైతన్య చేతుల మీదుగా 'పల్లబురుసు' మూవీ టీజర్ విడుదలై సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ కావడం గమనార్హం. ఈ సినిమాలో సీనియర్ నటుడు సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ గ్లింప్స్, అలాగే ప్రజాదరణ పొందిన 'కొత్త సోకు' అనే జానపద గీతం ఈ చిత్రంపై భారీ అంచనాలను రేకెత్తించాయి. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబడుతోంది.
ఆకట్టుకుంటున్న ప్రారంభ సన్నివేశం
'పల్లబురుసు' సినిమా టీజర్ ఓ స్వచ్ఛమైన, నవ్వులు పూయించే గ్రామీణ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. కథానాయకుడు గ్రామీణ వాతావరణంలో వేప పుల్లతో పళ్లు తోముకుంటుండగా.. గ్రామానికి చెందిన కొందరు గ్రామస్తులు కుతూహలంతో అతడి వద్దకు వచ్చి.. 'పల్లబురుసు' తేలేదా? అని ప్రశ్నిస్తారు. ఈ ఒక్క చిన్న సీన్ స్టోరీలోని హాస్యాన్ని, పల్లెటూరి అమాయకత్వాన్ని స్పష్టంగా చూపిస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుంది. టైటిల్, ఆ గ్రామీణ వాతావరణానికి ఉన్న ముడిని చాలా ఆసక్తికరంగా చూపించారు.

సస్పెన్స్‌తో కూడిన కామెడీ
'పల్లబురుసు' టీజర్ ముందుకు సాగే కొద్దీ స్టోరీలో ఉన్న రకరకాల విచిత్రమైన పాత్రలు, వారి మధ్య జరిగే హాస్యభరిత సంభాషణలు ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తాయడంలో ఎలాంటి సందేహం లేదు. 'పల్లబురుసు' అనే టైటిల్ చుట్టూ అల్లుకున్న సస్పెన్స్, హాస్యాన్ని పండించిన విధానం ఈ చిత్రంపై ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. ఉదయ్ చౌహాన్ దర్శకత్వంలో ఎపిక్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించగా.. ప్రముఖ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాను సమర్పిస్తోంది. కామెడీతో పాటు మనసుకు హత్తుకునే గ్రామీణ భావోద్వేగాల కలయికగా ఈ సినిమా రూపొందింది. ఆగస్టు 14న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.












Click it and Unblock the Notifications