ఆ హీరోయిన్‌తో శృతిమించిన సరసాలు.. వయాగ్రా ఓవర్‌డోస్‌తో డైరెక్టర్ మృతి?

దేశవ్యాప్తంగా చాలా మంది నటీమణులు తమ తోటి నటీనటులు, దర్శకులు, నిర్మాతలు, ఇతర సహచరుల నుంచి ఎదుర్కొంటున్న లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా ముందుకు వస్తున్నారు. వేదం, కమీనా వంటి చిత్రాలలో తన పాత్రలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన, ప్రముఖ తమిళ యాంకర్, నటి లేఖా వాషింగ్టన్ ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాన్ని వెల్లడించారు. కొన్నాళ్లక్రితం ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని బయటపెట్టారు. ఓ ప్రముఖ తమిళ దర్శకుడు తన సినిమాలో అవకాశం ఇస్తే "బదులుగా నాకు ఏమి లభిస్తుంది" అని ఒకసారి తనను అడిగారని ఆమె వెల్లడించారు.

ఓ రోజు రాత్రి తన కారులో ఎక్కించుకుని సినిమాలో అవకాశం ఇస్తే ప్రతిఫలంగా తనకేమీ లభిస్తుందని తనను అడిగినట్లు లేఖ తెలిపారు. అతని ఉద్దేశం అర్థమైనా ఏం తెలియనట్లు నటించానని.. కానీ ఆ డైరెక్టర్ పట్టువదలకుండా అడగడంతో.. నీతో పడుకునే ఆలోచన లేదని కోపంగా సమాధానం చెప్పేశానని ఆమె చెప్పుకొచ్చింది. కానీ ఆమె కఠినమైన సమాధానం అతన్ని ఆశ్చర్యపరిచినా అతను ఆమెను ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. చివరికి, లేఖకు ఆ పాత్ర దక్కలేదు.

Actress Lekha Washington Shares Shocking Casting Couch Story and Tamil Director Death Details

కొద్ది రోజుల అనంతరం ఆ డైరెక్టర్ ఓ టాప్ హీరోయిన్ తో సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాలకు వెళ్లాడు. అక్కడ వయాగ్రా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల గుండెపోటుతో మరణించాడని లేఖ వెల్లడించింది. ఆ ఘోరమైన సంఘటనను గుర్తుచేసుకుంటూ, "దీన్నే కర్మ అంటారు," అని లేఖ నిట్టూర్చింది. లేఖ వాషింగ్టన్ చేసిన కామెంట్స్ అప్పట్లో కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో కలకలం రేపాయి. దాంతో ఆమెను కమిట్మెంట్ అడిగిన ఆ డైరెక్టర్ ఎవరో అంటూ అప్పట్లో చర్చ జరిగింది. అయితే అప్పట్లో రష్యాకు షూటింగ్ కోసం వెళ్లిన తమిళ సినిమా డైరెక్టర్ జీవా గుండెపోటుతో మరణించారు. అయితే లేఖ వాషింగ్టన్ చేసిన కామెంట్స్ ఆయనను ఉద్దేశించేనా అంటూ చర్చ జరిగింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+