Holiday: ఏపీలో ఆ జిల్లాలో రెండు రోజులు స్కూల్స్, కాలేజీలకు సెలవు..!
ఏపీలో ప్రధాని మోడీ పర్యటించబోతున్నారు. ఆగస్టు 1న విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించబోతున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ప్రధాని పాల్గొనే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ తో పాటు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా పాల్గొనబోతున్నారు.
ఈ నేపథ్యంలో భోగాపురం ఎయిర్ పోర్టు వద్ద ఏర్పాటు చేసే సభకు వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. ఇదే క్రమంలో బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి కూడా భారీ ఎత్తున జనాల్ని తరలిస్తున్నారు. ఇందుకోసం జిల్లాలోని ఆర్టీసీ, ప్రభుత్వ బస్సులు, ఇతర పాఠశాల, కళాశాల బస్సులను వాడబోతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవులు (Holiday)ప్రకటించారు. ఈ నెల 31, ఆగస్టు 1న విద్యాసంస్థలకు ఇలా సెలవు ఇచ్చారు.

జిల్లా రవాణా అధికారికి జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలలు బస్సుల్ని పంపి సహకరించాలని కలెక్టర్ సర్కులర్ జారీ చేశారు. దీంతో అధికారులు బస్సుల సమీకరణ, అందులో జనాల సమీకరణకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోడీ టూర్ నేపథ్యంలో విశాఖ, విజయనగరం జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. అయితే ఇంకా అధికారులు ప్రకటనలు చేయలేదు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications