హైదరాబాద్ లో దంచికొట్టిన వర్షం.. గణేష్ నిమజ్జనాల వేళ.. అధికారులకు సీఎం కీలక ఆదేశాలు..

హైదరాబాద్ లో వర్షం దంచి కొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. హైదరాబాద్ లోని కూకట్ పల్లి, అల్వాల్, బాలానగర్, కాప్రా, మల్కాజ్ గిరి, దుండిగల్, రామ్ నగర్, అంబర్ పేట్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, కోఠీ, మలక్ పేట్, చంపాపేట్ తదితర ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేసి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా షేక్‌ పేట పరిసర ప్రాంతాల్లో వర్షపు నీరు భారీగా రోడ్డుపై చేరడంతో వాహనదారులు ముందుకు వెళ్లేందుకు అవస్థలు పడ్డారు. మరో రెండు రోజుల పాటు హైదరాబాద్ లో వర్షాలు ఇలాగే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాద్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, హైడ్రా, పోలీసు కమిషనర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు.

అలాగే నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలవకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలని సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. రాత్రి సమయంలోనూ భారీ వర్షం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో సహాయక బృందాలు, కంట్రోల్ రూమ్‌ లు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటూ పరిస్థితిని పర్యవేక్షించాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. ఓ వైపు గణేష్ నిమజ్జనాలు.. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు.

CMRevanth Heavy rains in Hyderabad CM Revanth Reddy puts administration and officials on high alert

మరోవైపు బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో మంగళ, బుధవారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పెద్దపల్లి, జయశంకర్ భూపాల్ పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం సహా ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే మరో 20 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. ఈ మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+