ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సినిమా చూసేందుకు పర్మిషన్ ఇవ్వండి.. సీఎం రేవంత్ కు హీరో నాని రిక్వెస్ట్..
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో 'ప్యారడైజ్' మూవీ మేనియా నడుస్తోంది. ఇప్పటికే నైజాంలో అడ్వాన్స్ బుకింగ్స్ జోరు కొనసాగుతోంది. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి. సెప్టెంబర్ 24 ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధం అయింది. ఇక రిలీజ్ కు ఒక్కరోజు ముందు అంటే సెప్టెంబర్ 23 న సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ప్రీమియర్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఎప్పుడెప్పుడు మూవీ రిలీజ్ అవుతుందా చూసేద్దాం అని నేచురల్ స్టార్ నాని ఫ్యాన్స్ ఫుల్ ఆకలితో ఉన్నారు. అటు నాని కెరీర్ లో ఇది చాలా స్పెషల్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. ఈ సినిమాకోసం తన గత సినిమాల కంటే చాలా కష్టపడ్డానని ఇటీవల నాని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మూవీని ఫ్యాన్స్ తో కలిసి చూసేందుకు నాని ఆసక్తి చూపిస్తున్నారు.
Hon’ble Chief Minister Shri @revanth_anumula Garu, Hon’ble Minister of Cinematography Shri @KomatireddyKVR Garu & the respected officials of @TelanganaCOPs.
— Nani (@NameisNani) September 22, 2026
This is a request from a fan of cinema and, more importantly, someone who has enjoyed cinema at its very best from a very…
ఈ మేరకు మూవీ లవర్స్ కు అడ్డాగా మారిన హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో నాని తన ఫ్యాన్స్ తో కలిసి చూడాలని అందుకోసం సీఎం రేవంత్ రెడ్డిని ఆయన రిక్వెస్ట్ చేశారు. 'ఒక సినిమా అభిమానిగా ఆర్టీసీ క్రాస్ రోడ్ థియేటర్ లో అందరితో కలిసి మూవీ చూడాలనుకుంటున్నా. ప్రొటోకాల్స్, సేఫ్టీ గైడ్ లైన్స్ పాటిస్తాం. మా అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుంటారని ఆశిస్తున్నా' అని సీఎంను ట్యాగ్ చేస్తూ నాని తాజాగా ఎక్స్ లో ట్వీట్ చేశారు. అయితే 2024 లో అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో లో జరిగిన ఘటన నేపథ్యంలో తాజాగా నాని రిక్వెస్ట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

ఇక 2024 డిసెంబర్ 4న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 బెనిఫిట్ షో కోసం వేలాది మంది అభిమానులు, ప్రేక్షకులు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ వద్ద గుమిగూడారు. అదే సమయంలో అల్లు అర్జున్ థియేటర్ కు వస్తున్నారన్న సమాచారం రావడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా జనసంద్రం అయింది. దాంతో పరిస్థితి అదుపుతప్పింది. ఇక అభిమానులు ఒక్కసారిగా థియేటర్ లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన నేపథ్యంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ ఘోరమైన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ఊపిరాడక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ 11 గా పోలీసులు చేర్చారు. ప్రస్తుతం ఈ కేసు నాంపల్లి కోర్టులో విచారణలో ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాను అభిమానులతో కలిసి థియేటర్ లో సినిమా చూస్తానని నాని చెప్పడంపై అటు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications
