తెలంగాణ పోలీస్ శాఖ భారీ నోటిఫికేషన్ రిలీజ్

కొలువుల ప్రకటన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు ప్రభుత్వం మైండ్ బ్లోయింగ్ న్యూస్ అందించింది. రాష్ట్ర హోంశాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. ఒకేసారి ఏకంగా 7,437 పోస్టుల నియామకం కోసం 'తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి' (TGPRB) బుధవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ బంపర్ నోటిఫికేషన్‌తో సుదీర్ఘకాలంగా రాత్రింబవళ్లు శ్రమిస్తున్న నిరుద్యోగుల్లో సరికొత్త ఆశలు చిగురించాయి.

ఈ దఫా వెలువడిన ప్రకటనల్లో సింహభాగం పోస్టులు కానిస్టేబుల్ విభాగంలోనే ఉన్నాయి. మొత్తం నాలుగు వేర్వేరు నోటిఫికేషన్ల ద్వారా సివిల్ పోలీస్, స్పెషల్‌ ప్రొటెక్షన్‌ ఫోర్స్‌ (SPF), ఫైర్ సర్వీసెస్ , జైళ్ల శాఖల్లోని పోస్టులను భర్తీ చేయనున్నారు. దాదాపు 7 వేల వరకు కానిస్టేబుల్, సమాన స్థాయి పోస్టులే ఉండటం విశేషం. అర్హులైన అభ్యర్థులు బోర్డు అధికారిక సైట్ www.tgprb.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. దరఖాస్తుల స్వీకరణకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, ప్రొఫార్మా వివరాలను అతి త్వరలోనే సైట్‌లో అందుబాటులో ఉంచుతామని బోర్డు ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు వెల్లడించారు.

TelanganaPolice Telangana Police Department releases a massive notification releases notification

విభాగాల వారీగా ఖాళీల వివరాలు:

1. ఫైర్‌ సర్వీసెస్ :

  • స్టేషన్ ఫైర్ ఆఫీసర్: 39
  • ఫైర్ ఫైటర్: 751

2. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్

  • సబ్ ఇన్స్‌స్పెక్టర్ (SI): 44
  • కానిస్టేబుల్: 1,380

3. జైళ్ల శాఖ :

  • డిప్యూటీ జైలర్ (పురుషులు): 14
  • డిప్యూటీ జైలర్ (మహిళలు): 01
  • వార్డర్ (పురుషులు): 196
  • వార్డర్ (మహిళలు): 12

దరఖాస్తుకు ముందే ఈ సర్టిఫికెట్లు రెడీగా ఉంచుకోండి!

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమయ్యేలోపే అభ్యర్థులు తమ వద్ద తగిన ప్రామాణిక పత్రాలను సిద్ధం చేసుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డు మార్గదర్శకాలు జారీ చేసింది.

  • ఎస్సీ వర్గాలు: కొత్త గ్రూపింగ్ (1, 2, 3) వర్గీకరణ పరిధిలోకి వచ్చే అప్‌డేటెడ్ కుల ధ్రువీకరణ పత్రం.
  • ఎస్టీ వర్గాలు: సంబంధిత తాజా క్యాస్ట్ సర్టిఫికెట్.
  • ఈడబ్ల్యూఎస్ (EWS): ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి (ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ తర్వాత) పొందిన ధ్రువీకరణ పత్రం.
  • బీసీ వర్గాలు: ప్రస్తుత ఏప్రిల్ 1వ తేదీ తర్వాత తీసుకున్న నాన్-క్రీమీలేయర్ సర్టిఫికెట్.
  • స్థానికత ఆధారాలు: 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు బోనఫైడ్ లేదా స్థానిక నివాస ప్రమాణ పత్రం (వర్తించేది).
  • ప్రత్యేక కేటగిరీలు: దివ్యాంగులు, క్రీడాకారులు తమకు కేటాయించిన రిజర్వేషన్ల ప్రయోజనం కోసం దానికి సంబంధించిన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.

అభ్యర్థులు రాత పరీక్షలకు సిద్ధమవడమే కాకుండా, శారీరక , వైద్య పరీక్షలకు అవసరమైన సన్నాహాలు కూడా ముందే చేసుకోవాలని రిక్రూట్‌మెంట్ బోర్డ్ సూచించింది. కాబట్టి నిరుద్యోగ మిత్రులారా.. ఆలస్యం చేయకుండా కావలసిన ధ్రువపత్రాలను సమకూర్చుకుని, మీ లక్ష్య సాధన దిశగా వేగం పెంచండి!

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+