'ఐ బొమ్మ'లో నాలుగు కొత్త సినిమాల స్ట్రీమింగ్
ఓటీటీల్లో సినిమాలు స్ట్రీమింగ్ అయిన నిముషాల వ్యవధిలోనే ఐబొమ్మ వెబ్ సైట్ లో స్ట్రీమింగ్ చేయడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ సైట్ పై తెలుగు సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు పలువురు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే దీనికి సంబంధించిన సర్వర్లు ఇతర దేశాల్లో ఉండటంతో బ్లాక్ చేసిన గంటల వ్యవధిలోనే కొత్త డొమైన్స్ తో యాక్టివ్ అవుతున్నాయి. థర్డ్ పార్టీ సైట్ లో సినిమాలు వస్తే నిర్మాతలకు భారీగా నష్టం. అయినప్పటికీ ప్రేక్షకులు కూడా ఐబొమ్మలో సినిమాలు డౌన్ లోడ్ చేసుకోవడానికి, చూడటానికి అలవాటుపడ్డారు. ఎందుకంటే కుటుంబాలతో థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడాలంటే వేల రూపాయల ఖర్చు అవుతోంది. తాజాగా నాలుగు కొత్త సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఓం భీమ్ బుష్
ఈ సినిమా మంచి హిట్ అయింది. శ్రీవిష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలో నటించారు. హర్రర్ కామెడీగా తెరకెక్కింది. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ వెంటనే ఐబొమ్మలోకి కూడా ఓం భీమ్ బుష్ వచ్చేసింది.

యాత్ర 2
ఈ సినిమా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ఈ సినిమాకు మహి.వి.రాఘవ దర్శకుడు. ఫిబ్రవరి రెండోతేదీన థియేటర్లలో విడుదలైంది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ప్రస్తుతం ఐబొమ్మలో కూడా ఉంది.
ప్రేమలు
మళయాళ పరిశ్రమను ఈ సినిమా షేక్ చేసిందని చెప్పొచ్చు. రూ.130 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సినిమాను తెలుగులో రాజమౌళి తనయుడు కార్తికేయ విడుదల చేశారు. ఈనెల 12వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. వెంటనే ఐబొమ్మలోకి కూడా సినిమా వచ్చేసింది.
గామి
విశ్వక్సేన్ హీరోగా నటించిన అడ్వెంచెరస్ థ్రిల్లర్ ఇది. మార్చి 8వ తేదీన థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ వచ్చింది. తర్వాత ఓటీటీలోకి వచ్చింది. ఆ వెంటనే ఐబొమ్మలోకి కూడా వచ్చేసింది.












Click it and Unblock the Notifications