Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఈ వారం ఎలిమినేష‌న్ అత‌డేనా.. ఇద్ద‌రు డేంజ‌ర్ జోన్‌లో..

ఈసారి బిగ్‌బాస్ వీకెండ్ సంద‌డిగా మార‌నుంది. వీకెండ్ వచ్చిందంటే చాలు బిగ్ బాస్ ఆడియన్స్ కి పండగ వాతావరణం క‌నిపిస్తుంది. ఈసారి నాగార్జున రివ్యూలు ఆసక్తిగా ఉండ‌బోతున్నాయి. ఆదివారం ఎపిసోడ్ మాత్రం జాయ్‌పుల్‌గా సాగ‌బోతుంది. అంద‌రికి ఫ‌న్ ఉంటే మాత్రం కంటెస్టంట్ల‌కు మాత్రం ఎలిమినేష‌న్ టెన్ష‌న్‌. ఇప్ప‌టికే ఇంట్లో నుంచి ముగ్గురు కంటెస్టెంట్‌లు బ‌య‌టికి వెళ్లారు. అందులో మొద‌టివారం కిర‌ణ్‌రాథోడ్ వెళ్ల‌గా, రెండో వారం ష‌కీలా, మూడోవారం దామిని ఎలిమినేట్ అయ్యి ఇంటికి వెళ్లిపోయారు. ఈ మూడు ఎలిమినేష‌న్ల‌లో మ‌హిళ‌లు ఉండ‌డం విశేషం.

అయితే, ఇంటి నుంచి వరుసగా ముగ్గురు లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవ్వ‌గా, ఈసారి ఖ‌చ్చితంగా మేల్ కంటెస్టెంట్ ఎలిమినేష‌న్ ఉంటోంద‌ని చాలామంది అనుకుంటున్నారు. ఈసారి ఎలిమినేష‌న్ అబ్బాయిల వంతని అనుకుంటున్నారు. ఎప్ప‌టిలాగానే ఈ వారం నామినేష‌న్స్ ర‌స‌వ‌త్తరంగా మారాయి. ఈ వారం నామినేషన్స్ ప్రక్రియ సరికొత్తగా నిర్వహించాడు బిగ్ బాస్. శివాజీ, సందీప్, శోభా శెట్టిలను జ్యూరీ సభ్యులుగా నియమించాడు. నామినేషన్స్ లో కంటెస్టెంట్స్ చెప్పే కారణాలను వారు ఏకీభవించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ లో రతికా రోజ్, ప్రిన్స్ యావర్, గౌతమ్, శుభశ్రీ, ప్రియాంక ఈ వారం నామినేష‌న్‌లో ఉ న్నారు.

 Is he the elimination this week.. Both of them are in the danger zone..

నామినేష‌న్లో భాగంగా జ్యూరీ సభ్యుల ఏకాభిప్రాయంతో ఒకరిని నేరుగా నామినేట్ చేయాలని బిగ్‌బాస్‌ చెప్పాడు. అయితే, జ్యురీ స‌భ్యులు ముగ్గురు క‌లిసి టేస్టీ తేజాను నామినేట్ చేశారు. అది అతనికి భారీ నష్టం చేకూరుస్తుంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. వీరిలో అత్యధికంగా 40 శాతం ఓట్ల‌తో ప్రిన్స్ యావర్ టాప్ ప్లేస్‌లో ఉన్నాడట. తర్వాత స్థానంలో 25 శాతం ఓట్ల‌తో ప్రియాంక జైన్ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఇక మూడో స్థానంలో ర‌తిక‌, నాలుగో స్థానంలో గౌతమ్ కృష్ణ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఐద‌వ స్థానంలో టేస్టీ తేజా, ఆరో స్థానంలో శుభ‌శ్రీ ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఈ రిజ‌ల్ట్‌ను బ‌ట్టి చూస్తే డేంజ‌ర్ జోన్‌లో తేజా, శుభ‌స్రీ ఉన్నారు. అయితే, వీరిద్ద‌రిలో ఎవ‌రు ఇంట్లో ఉంటారో, బ‌య‌టికి వెళ్తారో రేప‌టితో తెలిసిపోతుంది. అయితే, ఎక్క‌వు శాతం మంది తేజనే ఇంటిని వెళ్లోచ్చు అనే మాట‌లు వినిపిస్తున్నాయి.

మరోవైపు పెద్ద ఎత్తున వైల్డ్ కార్డు ఎంట్రీలు ఉంటాయనే ప్రచారం జరుగుతుంది. ఇందులో భాగంగానే అక్టోబర్ 9న బిగ్ బాస్ మరోసారి లాంచ్ ఈవెంట్ ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ఈవెంట్ తో మరో ఆరుగురు లేదా ఏడుగురు కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనున్నారని తెలుస్తోంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీల ద్వారా ఈసారి ఆరుగురుని హౌస్ లోకి పంపనున్నారు. అయితే హౌస్ లోకి ఎవరు వెళ్తున్నారన్నది ఇంతవరకు క్లారిటీ లేదు. కానీ సోషల్ మీడియాలో కొంతమంది పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో సురేఖావాణి కూతురు సుప్రిత, హీరోయిన్‌ ఫర్జానా, జబర్దస్త్ ఫేమ్ నరేష్‌, మొగలి రేకులు సీరియల్‌ తో పాపులర్ అయిన నటి అంజలి, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ భోలే షావలి, నటి పూజా మూర్తి కూడా వైల్డ్‌ కార్డ్‌తో బిగ్ బాస్ హౌస్ లోకి రానున్నారని సోషల్‌ మీడియాలో వార్తలు చెక్క‌ర్లు కొడుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+