ఓటీటీలోకి లేటెస్ట్ ఇండస్ట్రీ హిట్ సినిమా.. ఇవాళ అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్..
సూపర్ స్టార్ రజనీకాంత్ లేటెస్ట్ మూవీ 'జైలర్ 2' దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదలై సంచలన విజయం నమోదు చేసిన సంగతి తెలిసిందే. 2023 లో వచ్చిన జైలర్ పార్ట్ 1 చిత్రానికి ఇది కొనసాగింపుగా రూపొందింది. జైలర్ 2 మూవీ రిలీజ్ అయిన ఫస్ట్ రోజు నుంచే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ అందుకుంది. ఇప్పటి వరకూ ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.830 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. తమిళనాడుతోపాటు ఓవర్సీస్, తెలుగు రాష్ట్రాలు, నార్త్ బెల్ట్ ఇలా ప్రతీ ఏరియాలో మూవీ ఘన విజయం సాధించింది.
అటు టికెట్ బుకింగ్ యాప్స్ లోనూ ఈ మూవీ రికార్డులను నమోదు చేసింది. టికెట్ బుకింగ్ ప్లాట్ ఫామ్స్ లో జైలర్ 2 మూవీ మొత్తం టికెట్ అమ్మకాలు 1.12 కోట్లకు చేరుకున్నట్లు సమాచారం. అటు అడ్వాన్స్ బుకింగ్స్ లోనూ కేవలం 12 రోజుల్లోనే కోటికి పైగా టికెట్స్ విక్రయాల మైలురాయిని అందుకున్న తొలి తమిళ చిత్రంగా కూడా జైలర్ 2 మూవీ అరుదైన రికార్డును నమోదు చేసింది. ఈ మూవీ నవంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కు రెడీ అవుతోంది. అయితే నవంబర్ 11న కూడా బుక్ మై షో టికెట్ బుకింగ్ యాప్ లో ఈ మూవీకి 7 వేలకు పైగా టికెట్స్ అమ్ముడైనట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి ఈ మూవీ క్రేజ్ ఏంటో అర్థం అవుతుంది.

జైలర్ 2 మూవీ నవంబర్ 12 అర్ధరాత్రి నుంచి ప్రముఖ ఓటీటీ మాధ్యమం అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేరకు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉంది. ఇక జైలర్ 2 మూవీని థియేటర్లలో మిస్ అయినవాళ్లు ఇప్పుడు ఎంచక్కా ఓటీటీలో చూసే అవకాశం ఉంది. జైలర్ 2 ఇచ్చిన బ్లాక్ బస్టర్ వైబ్స్ తో రజనీకాంత్ ప్రస్తుతం ధర్మన్ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీకి కమల్ హాసన్ నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం. యువ డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు డైరెక్షన్ లో ఈ చిత్రం తెరకెక్కుతుంది.












Click it and Unblock the Notifications
