భగ్గుమన్న విభేదాలు: అల్లు అర్జున్‌పై జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
మెగా అభిమానులకు, అల్లు అర్జున్ అభిమానులకు మధ్య పచ్చగడ్డి వస్తే భగ్గుమంటోన్న సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ తరఫున నంద్యాల నుంచి పోటీచేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ స్వయంగా నంద్యాల వెళ్లి ప్రచారం చేశారు. అదే సమయంలో పిఠాపురం నుంచి పోటీచేస్తున్న పవన్ కల్యాణ్ విజయం కోసం మెగా కుటుంబ సభ్యులంతా ప్రచారం చేశారు. అల్లు అర్జున్ తండ్రి అల్లు అరవింద్ కూడా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు. బన్నీ మాత్రం పవన్ గెలవాలని కోరుకుంటూ ఓ ట్వీట్ తో సరిపెట్టారు.
అప్పటికే అంతంతమాత్రంగా ఉన్న సంబంధాలు ఈ సంఘటనతో భగ్గుమన్నాయి. దీనికితోడు ఇటీవలే మారుతీనగర్ సుబ్రమణ్యం సినిమా వేడుకకు హాజరైన అల్లు అర్జున్ తనవారికోసం ఎంత దూరమైనా వెళ్తాలనని ప్రకటించడంపై మెగా అభిమానులు నిప్పులు చెరుగుతున్నాయి. జనసేన పార్టీ ఉన్నప్పటికీ వైసీపీకి మద్దతివ్వడంపై, బన్నీ కామెంట్స్ పై సామాజిక మాధ్యమాల్లో హోరాహోరీ యుద్ధం నడుస్తోంది.

తాజాగా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ అల్లు అర్జున్ కు పెద్దగా అభిమానులు ఉండరని, కాకపోతే ఆయనకు ఆయనే అతిగా ఊహించుకుంటారన్నారు. అల్లు అర్జున్ కు అభిమానులన్నారనే విషయం తనకు తెలియదంటూ వ్యంగ్యోక్తి విసిరారు. ఇక్కడ ఉన్నది చిరంజీవి అభిమానులు, మెగా అభిమానులేనని, అది గుర్తుంచుకోవాలని, అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. జనసేన పార్టీ మొత్తం పోటీచేసిన 21 స్థానాల్లో విజయం సాధించామని, తమకు అల్లు అర్జున్ అవసరం ఏముందని ప్రశ్నించారు. ఆయనకు వైసీపీ అభ్యర్థికి మద్దతిచ్చారని, స్వయంగా వెళ్లి పోటీచేశారని, ఫలితం ఏమైందనే విషయాన్ని బన్నీ గుర్తుపెట్టుకుంటే మంచిదని హితవు పలికారు. అల్లు అర్జున్ పై జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతున్నాయి.












Click it and Unblock the Notifications