ఈ వయస్సులో నీకు ఇదేం పోయేకాలం .. హీరోయిన్‌ను గదికి పిలిచి
సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందని చాలామంది బహిరంగంగానే వెల్లడించారు. తమకు ఎదురైన లైంగిక వేధింపులు ,కాస్టింగ్ కౌచ్, కమింట్మెంట్‌ల గురించి హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇటీవల పలు సందర్భాల్లో వెల్లడిస్తున్నారు. తాజాగా మరో హీరోయిన్ తాను కూడా కాస్టింగ్ కౌచ్ బారిన పడ్డానని చెప్పుకొచ్చింది.
తారక్ మెహతా కా ఊల్టా చష్మా' సీరియల్‌లో మిసెస్ రోషన్ సోధీ పాత్రతో ప్రేక్షకుల ఆదరణ పొందిన నటి జెన్నిఫర్ మిస్ట్రీ, ప్రముఖ నిర్మాతపై సంచలన ఆరోపణలు చేసింది. ఆమెపై కొందరు కావాలనే ఇలా చేస్తుందని విమర్శలు చేసినప్పటికీ, జెన్నిఫర్ వాటిని లెక్కచేయలేదు. తాజా ఇంటర్వ్యూలో జెన్నిఫర్ మాట్లాడుతూ, 2019లో సింగపూర్‌లో షూటింగ్ జరుగుతున్నప్పుడు నిర్మాత అసిత్ మోదీ తన పెదవుల గురించి అనుచితంగా మాట్లాడాడని ఆరోపించింది. "నీ లిప్స్ చాలా సెక్సీగా ఉన్నాయి" అని వ్యాఖ్యానించడమే కాకుండా, తన గదికి రమ్మని కోరాడని వెల్లడించింది. 2024లో అసిత్ మోదీపై దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసులో విజయం సాధించిన తర్వాత, ఈ విషయాన్ని బహిరంగంగా వెల్లడించడం ఇదే మొదటిసారి.

తనుశ్రీ దత్తా 'మీ టూ' ఆరోపణలు: మానసిక వేధింపులతో సతమతం
ఇదిలా ఉండగా, 'మీ టూ' ఉద్యమంలో భాగంగా గతంలో లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నటి తనుశ్రీ దత్తా మరోసారి మీడియా ముందుకు వచ్చింది. 'మీ టూ' ఆరోపణల తర్వాత తన జీవితం దారుణంగా మారిపోయిందని ఆమె వాపోయింది. తన ఇంటికి వచ్చి రోజూ వేధిస్తున్నారని, సొంత ఇంట్లో కూడా ప్రశాంతత లేకుండా పోయిందని, మానసికంగా వేధింపులకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. కనీసం ఇంటి పనులు చూసుకునే పని మనుషులను కూడా పెట్టుకోలేని వాతావరణం ఉందని, తన పరిస్థితి దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ లాగే ఉందని ఆమె చెప్పుకొచ్చింది.












Click it and Unblock the Notifications