అర్ధరాత్రి ఢిల్లీ నుంచి పిలుపు. రూ. 31,500 కోట్లతో ఎల్ఐసీ భారీ ఆపరేషన్

ఒకవైపు స్టాక్ మార్కెట్ సాధారణంగా నడుస్తోంది. ఆ సమయంలో ప్రభుత్వం నుంచి ఒక ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌కు అత్యవసర సమాచారం అందింది. "వెంటనే ఢిల్లీలోని శాఖ కార్యాలయానికి రావాలి" అన్నది ఆ పిలుపు సారాంశం. ఎందుకు, ఏంటి అనే వివరాలు ఏవీ చెప్పలేదు. తీరా అక్కడకు వెళ్లాక అసలు విషయం బయటపెట్టారు అధికారులు. అదే రోజు సాయంత్రం దేశంలోనే అతిపెద్ద జీవిత భీమా సంస్థ 'ఎల్ఐసీ'లో ప్రభుత్వ వాటాల విక్రయాన్ని ప్రారంభిస్తున్నామని, దానికి సంబంధించిన పత్రాలు సిద్ధం చేయాలని బాధ్యతలు అప్పగించారు. ఇలా అత్యంత రహస్యంగా, శరవేగంగా రూ. 31,500 కోట్ల విలువైన ఎల్ఐసీ షేర్ల విక్రయం అమల్లోకి వచ్చింది.

మార్కెట్ క్యాచ్ చేయకుండా పక్కా ప్లాన్

సాధారణంగా ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో షేర్లను విక్రయిస్తోందని ముందుగానే తెలిస్తే.. మార్కెట్‌లోని బడా ట్రేడర్లు దాన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రమాదం ఉంటుంది. షేర్ల సరఫరా పెరుగుతుందనే నెపంతో ఎల్ఐసీ షేరు ధరను కృత్రిమంగా కిందకు పడేసే అవకాశం ఉంది. ఈ ముప్పును ముందుగానే పసిగట్టిన అధికారులు 'చేరాల్సిన వారికే, కావాల్సినంత సమాచారం' అనే వ్యూహాన్ని పాటించారు. చివరికి ఈ డీల్‌లో సలహాదారులుగా ఉన్న నాలుగు ప్రధాన బ్యాంకర్లలో కొందరికి కూడా స్టాక్ ఎక్స్ఛేంజీలకు సమాచారం ఇచ్చే కొద్ది గంటల ముందు మాత్రమే అసలు విషయం తెలిసింది.

How Government Secretly Executed Rs 31 500 Crore LIC Share Sale Right Under the Stock Market s Radar

ఉచితంగానే సేవలుందించిన దిగ్గజ బ్యాంకులు

ఈ మెగా విక్రయంలో మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే.. ప్రభుత్వానికి సలహాలు అందించిన ఏ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ కూడా దీనికి ఎటువంటి ఫీజు తీసుకోలేదు. టెండర్ల ప్రక్రియ సమయంలోనే ఒక బ్యాంక్ రూపాయి కూడా ఆశించకుండా ఉచితంగా పనిచేసేందుకు ముందుకు రావడంతో, మిగిలిన బ్యాంకులు కూడా ఉచితంగానే సేవలు అందించడానికి మొగ్గు చూపాయి. ఇంత పెద్ద ఆపరేషన్‌కు ఫీజు తీసుకోకపోవడం వింతగా అనిపించినా.. ప్రభుత్వంతో ఏర్పడే దీర్ఘకాలిక బంధం, మార్కెట్‌లో తమ బ్యాంక్ రేటింగ్ పెరగడం వంటి అంశాలు వీరికి భవిష్యత్తులో చాలా ప్రయోజనకరంగా మారతాయి.

EPFO, LIC: వెలుగులోకి వచ్చిన కోట్ల రూపాయలు, పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన!
EPFO, LIC: వెలుగులోకి వచ్చిన కోట్ల రూపాయలు, పార్లమెంట్‌లో కేంద్రం ప్రకటన!

అంచనాలను తలకిందులు చేసిన కేంద్రం

వారం చివర్లో ఎల్ఐసీ ఆర్థిక ఫలితాలువిడుదలైన తర్వాతే ప్రభుత్వం వాటాల విక్రయం వైపు వెళ్తుందేమోనని మార్కెట్ విశ్లేషకులు భావించారు. కానీ కేంద్రం అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ముందే అడుగులు వేసింది. ఎలాంటి ముందస్తు ప్రకటనలు లేకుండా ఉన్నపళంగా మార్కెట్‌లోకి రావడం వల్ల ఊహాగానాలకు బ్రేక్ పడటమే కాకుండా, షేరు ధరపై ప్రతికూల ప్రభావం పడకుండా కాపాడుకోగలిగారు.

2.5 శాతంతో మొదలై 6.5 శాతానికి.. ఊహించని డిమాండ్

ప్రభుత్వం ముందుగా కేవలం 2.5 శాతం వాటాను మాత్రమే విక్రయానికి ఉంచింది. ఒకవేళ డిమాండ్ బాగుంటే మరో 4 శాతం అదనంగా విక్రయించే సదుపాయాన్ని అందుబాటులో ఉంచుకుంది. మొదట చిన్న విడతగా రావడం వల్ల సంస్థాగత ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగింది. అనుకున్నట్లే సంస్థాగత ఇన్వెస్టర్లు ఈ ఆఫర్ పట్ల విపరీతమైన ఆసక్తి చూపించడంతో, నిర్ణీత కోటా కంటే 3.32 రెట్లు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. దీంతో ప్రభుత్వం మిగిలిన 4 శాతం అదనపు వాటాను కూడా మార్కెట్లోకి వదిలింది. చివరికి మొత్తం 6.5 శాతం వాటాను విక్రయించి విజయవంతంగా రూ. 31,500 కోట్లను సమీకరించింది.

LIC పాలసీదారులకు షాక్: ఇక ఆ కార్డులతో యూజ్ లేదు.. కొత్త రూల్
LIC పాలసీదారులకు షాక్: ఇక ఆ కార్డులతో యూజ్ లేదు.. కొత్త రూల్

సెబీ నిబంధనలకు పక్కాగా చెక్

ఈ విక్రయంతో ఎల్ఐసీకి సంబంధించిన ఒక పెద్ద చట్టపరమైన చిక్కు కూడా తొలగిపోయింది. స్టాక్ మార్కెట్ నిబంధనల ప్రకారం ప్రైవేట్ లేదా ప్రభుత్వ సంస్థ ఏదైనా సరే కనీసం 10 శాతం వాటాను ప్రజా భాగస్వామ్యంగా (పబ్లిక్ షేర్ హోల్డింగ్) ఉంచాల్సి ఉంటుంది. దీనికి 2027 మే వరకు సమయం ఉన్నప్పటికీ, ప్రస్తుత విక్రయంతో ఎల్ఐసీలో ప్రజా భాగస్వామ్యం 10 శాతానికి చేరింది. 2022 మే నెలలో ఎల్ఐసీ ఐపీఓకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇందులో తన వాటాను తగ్గించుకోవడం ఇదే తొలిసారి. మార్కెట్‌ను ఆశ్చర్యపరుస్తూ, అతి కొద్దిమందితో నడిపించిన ఈ 'సస్పెన్స్' వ్యూహం ఇప్పుడు కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+