బుధుడి నక్షత్ర సంచారం.. త్వరలో ఈ రాశులవారికి స్వర్ణయుగం!
2026 నవంబర్ 25న బుధుడు విశాఖ నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని బుద్ధి, విద్య, వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన గ్రహంగా పరిగణిస్తారు. నవంబర్ 25 నుండి డిసెంబర్ 4 వరకు కొనసాగే ఈ సంచారం వృషభం, మీనం, ధనుస్సు, కన్య, కర్కాటక రాశుల వారికి ఉద్యోగం, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారం, ఆస్తి విషయాల్లో అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి.
విశాఖ నక్షత్రంలో బుధుడి సంచారం
గురువు ఆధీనంలోని విశాఖ నక్షత్రంలో బుధుడి సంచారానికి కూడా జ్యోతిష్య పరంగా ప్రాధాన్యత ఉంది. ఈ నక్షత్ర మార్పు సమయంలో కొన్ని రాశుల వారికి ఉద్యోగం, వ్యాపారం, ఆదాయం, కుటుంబ విషయాలు, ఆస్తి సంబంధిత అంశాల్లో మార్పులు లేదా కొత్త అవకాశాలు ఎదురయ్యే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణుల అంచనా. ముఖ్యంగా ఈ ఐదు రాశులపై బుధుడి సంచారం ప్రభావం అనుకూలంగా ఉండొచ్చని పేర్కొంటున్నారు.

వృషభ రాశి
వృషభ రాశి వారికి నవంబర్ 25 నుంచి డిసెంబర్ 4 వరకు కాలం ఉద్యోగ, ఆర్థిక విషయాల్లో ఆసక్తికరంగా ఉండే అవకాశం ఉంది . పోటీ పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం పెరగవచ్చు. చాలాకాలంగా కొనసాగుతున్న కొన్ని సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంటుంది.ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి కొత్త అవకాశాలు కనిపించవచ్చు. ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారికి అదనపు బాధ్యతలు, పదోన్నతికి అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించగలిగితే పొదుపు పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది.
మీన రాశి
మీన రాశి వారికి బుధుడి విశాఖ నక్షత్ర సంచారం ఆర్థిక అంశాలపై ప్రభావం చూపవచ్చు. అనుకోని మార్గాల ద్వారా ఆర్థిక ప్రయోజనం లభించే అవకాశాలు ఉండవచ్చు .వ్యాపారం చేసే వారికి కొత్త ఒప్పందాలు లేదా పెట్టుబడి అవకాశాలు ఎదురుకావచ్చు. అయితే దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పూర్తి వివరాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవడం మంచిది.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారికి ఈ కాలం ఆదాయ అవకాశాలను పెంచుకునే సమయంగా ఉండవచ్చని చెబుతున్నారు. ముఖ్యంగా బుధుడి ప్రభావం లాభ స్థానంతో సంబంధం కలిగి ఉండటం వల్ల వ్యాపారం, ఉద్యోగం, అదనపు ఆదాయ మార్గాల్లో పురోగతి కనిపించవచ్చు. విద్య, బోధన, ప్రయాణాలు, టూరిజం వంటి రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు రావచ్చని చెబుతున్నారు.
కన్య రాశి
కన్య రాశి వారికి బుధుడి సంచారం ఆర్థిక, కుటుంబ, వృత్తి అంశాల్లో ప్రభావం చూపవచ్చని జ్యోతిష్య అంచనాలు చెబుతున్నాయి. ఆదాయం పెరగడంతో పాటు కుటుంబంలో సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.ఇప్పటివరకు పూర్తికాని పనులను వేగంగా పూర్తి చేసే అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరించాల్సి రావచ్చు. కష్టపడి పనిచేసేవారికి దాని ఫలితం కనిపించే అవకాశం ఉంది
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధుడి విశాఖ నక్షత్ర సంచారం కుటుంబ సౌఖ్యం, ఆస్తి, వాహనాలకు సంబంధించిన అంశాల్లో ప్రాధాన్యత కలిగించవచ్చని చెబుతున్నారు. ఇల్లు, భూమి లేదా వాహనం కొనుగోలు గురించి ఆలోచిస్తున్న వారికి అనుకూలంగా ఉంది .దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం గడిపే పరిస్థితులు ఏర్పడవచ్చు.














Click it and Unblock the Notifications
