అమిత్ షా రాజీనామా చేయాల్సిందే! హోంమంత్రికి కాక్రోచ్ సీరియస్ వార్నింగ్
ఓటర్ల జాబితా సవరణల్లో అక్రమాలు జరిగాయంటూ దేశవ్యాప్తంగా రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్ సాక్షిగా వేలాది మంది యువతీ యువకులు నిరసన గళం విప్పారు. ముంబై పోలీసుల ఆంక్షలు, భారీ బారికేడ్లను సైతం లెక్కచేయకుండా 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)తో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దారంతా బారికేడ్లు కట్టినా జనసందోహాన్ని ఆపడం పోలీసులకు సాధ్యపడలేదు.
అమిత్ షా రాజీనామా చేయాల్సిందే..
ఈ ఆందోళనలో సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విమర్శలు గుప్పించారు. గతంలో జంతర్ మంతర్ వద్ద జరిగినట్లు మళ్లీ లాఠీఛార్జ్ చేయిస్తే ఊరుకునేది లేదని, అలా జరిగితే అమిత్ షా రాజీనామా కోసం దేశవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అంతేకాకుండా ఢిల్లీలోని ఒక పోలీసు అధికారిని ఉద్దేశించి మాట్లాడిన ఆయన, ఖాకీ యూనిఫామ్ ఉంటే విధులకు కట్టుబడి ఉండాలని, రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేయవద్దని వ్యాఖ్యానించారు.

'ఇది ప్రజాస్వామ్య పోరాటం'..
ముంబై శివాజీ పార్క్ నిరసన సభకు ప్రముఖ నటి షబానా అజ్మీ, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ తరలివచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా షబానా అజ్మీ మాట్లాడుతూ, "ఓటు మన ప్రాథమిక హక్కు. వేలాది మంది పేర్లను ముందస్తు సమాచారం లేకుండా జాబితాల నుంచి తొలగిస్తుంటే చూస్తూ ఊరుకోలేం. ఈ పౌర చైతన్యపు అగ్నిశిఖ దేశమంతటా వ్యాపిస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ఎంతకాలమైనా పోరాడతాం" అని పిలుపునిచ్చారు. ప్రసిద్ధ గాయకుడు విశాల్ దద్లానీ మాట్లాడుతూ, ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకో పరిమితమైన అంశం కాదని, ఎన్నికల వ్యవస్థలోనే పారదర్శకత లోపిస్తే దేశంలో ప్రజాస్వామ్యానికే ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
సెక్షన్ 163 విధించినా మిన్నంటిన ఆందోళనలు..
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సైతం వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ యూత్ కాంగ్రెస్, ఎస్‌ఎఫ్‌ఐ (SFI), డీవైఎఫ్‌ఐ (DYFI) బృందాలు భారీ నిరసన చేపట్టాయి. ఈ క్రమంలో ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు విపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, "సామాన్య ప్రజల ఓటింగ్ హక్కును లాక్కునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు జైలుకు వెళ్లడానికైనా సిద్ధంగా ఉన్నాం" అని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేతి అఖిలేష్ యాదవ్ సైతం ఎన్నికల కమిషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివాదాన్ని తిప్పికొట్టిన ఈసీ, బీజేపీ సవాల్
మరోవైపు ఓటర్ల జాబితాల నిర్ణయాలపై ఈసీ కమిషనర్ల మధ్య అభిప్రాయభేదాలు ఉన్నాయన్న వార్తలను ఎన్నికల కమిషన్ తీవ్రంగా ఖండించింది. అన్ని నిర్ణయాలు ముగ్గురు కమిషనర్ల ఆమోదంతో ఏకగ్రీవంగానే తీసుకున్నామని స్పష్టం చేసింది. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందిస్తూ, విపక్షాలు లేనిపోని అసత్య ప్రచారాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయని, ఆ ప్రయత్నాలు ఎప్పటికీ పారవని వ్యాఖ్యానించారు.
నిరసనలు తెలపడానికి ఎవరికైనా హక్కు ఉంటుందని, కానీ చట్టబద్ధమైన అనుమతులు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసు చర్యలు అనివార్యమని బీజేపీ అధికార ప్రతినిధి అజయ్ ఆలోక్ పేర్కొన్నారు. ముంబైలో 'జెన్ నెక్స్ట్ ముంబై' అనే సంస్థ సీజేపీ నిరసనను వ్యతిరేకిస్తూ అంబేడ్కర్ విగ్రహం వద్ద శాంతియుత నిరసన తెలిపింది.
🚨 Abhijeet Dipke to Amit Shah:
— TEJASH 🚩 (@Tejashyy) October 2, 2026
This time, don’t give orders for a lathi charge.
You have already made one mistake on July 20. If you make the same mistake again, you will be the next one to resign.
If you want to behave like a goon, become one, but don’t be the country’s Home… pic.twitter.com/fMh70wg6YN














Click it and Unblock the Notifications
