మెగా డీఎస్సీ రగడ: వైసీపీ వర్సెస్ టీడీపీ, యాకిడి, విజయవాడలో ఉద్రిక్తతలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డీఎస్సీపై అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతుంది. ఏపీలో మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నాయకులు రాష్ట్రవ్యాప్తంగా దీక్షలు, ధర్నాలు చేపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు ఆందోళనలకు వైసీపీ పిలుపునిచ్చింది. దీనిని అడుగడుగునా అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు, నేతలు రంగంలోకి దిగుతున్నారు.

యాకిడి,విజయవాడ సెంట్రల్ లో వైసీపీ ఆందోళనలు ఉద్రిక్తం

దీంతో పరిస్థితిని కంట్రోల్ లో ఉంచటం కోసం శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు అదనపు బలగాలను మోహరించి పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ క్రమంలో నేడు అనంతపురం జిల్లా యాకిడిలో, విజయవాడ సెంట్రల్ లో వైసీపీ చేపట్టిన ఆందోళనలు ఉద్రిక్తతలకు కారణం అయ్యాయి. అనంతపురం జిల్లా యాకిడి మండలంలో వైసీపీ నాయకులు ఎలాంటి అనుమతి లేకుండా దీక్షకు దిగారు.

mega dsc row High tension prevails in Yadiki of Anantapur and Vijayawada Central as YSRCP vs TDP there

యాకిడిలో వైసీపీ, టీడీపీ నాయకుల దీక్ష.. ఉద్రిక్తత, రంగంలోకి పోలీసులు

దీనికి వ్యతిరేకంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు కూడా అదే ప్రాంతంలో బైఠాయించారు. పోటాపోటీగా వైసీపీ, టీడీపీ నాయకులు దీక్షలు చేపట్టటంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలకు సర్ది చెప్పి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకున్నట్టు తెలుస్తోంది.

విజయవాడలో రిలే నిరసన దీక్షలను అడ్డుకున్న బోండా ఉమా

మరోవైపు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో కూడా గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్ వద్ద వైసీపీ నాయకులు టెంట్లు వేసి రిలే నిరసన దీక్షలకు దిగారు. డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చెయ్యాలని వారు డిమాండ్ చేశారు. అలాగే విద్యా శాఖామంత్రి నారా లోకేష్ రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు. అయితే ఎమ్మెల్యే బొండా ఉమ వర్గం ఈ ధర్నాను అడ్డుకుంది. వైసీపీ అనధికారికంగా, అనుమతి లేకుండా ధర్నా చేస్తుందని టీడీపీవర్గం ఆరోపించింది.

వరుస విజయాల సింగరేణి.. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయి!
వరుస విజయాల సింగరేణి.. తాజాగా మరో చారిత్రాత్మక మైలురాయి!

వైసీపీ టెంట్లు తొలగించటంతో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య వర్గాల మధ్య తోపులాట

దీంతో వారు అక్కడ వేసిన వైసీపీ టెంట్లు తొలగించటంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను శాంతింపజేశారు. అయితే ఏం చేసినా తమ పోరాటం ఆగదని వైసీపీ నాయకులు అంటున్నారు. దాడులతో భయపెట్టలేరని తేచి చెప్తున్నారు.డీఎస్సీ కుంభకోణానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తక్షణం లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చెయ్యాలని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+