‘వేశ్యలది తప్పయితే.. అక్కడికే వెళ్లే కస్టమర్ల సంగతేంటీ’

టాలీవుడ్‌లో అగ్రనటిగా దూసుకెళ్తున్నారు సమంత. ఇటీవల గర్భం దాల్చిన ఈ ముద్దుగుమ్మ.. మాతృత్వపు మధుర క్షణాలను ఆస్వాదిస్తున్నారు. సినిమాలు చేసినా చేయకున్నా సమంత క్రేజ్‌లో ఏ మాత్రం తగ్గడం లేదు. పలు సర్వేలు, పోల్స్ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. సినిమాలతో పాటు సామాజిక అంశాలపైనా సమంత తన అభిప్రాయాలు తెలియజేస్తుంటారు. స్త్రీ హక్కులు, సమానత్వం, ఇతర అంశాలపై స్పందిస్తుంటారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈ వివరాల్లోకి వెళితే..

సమంతలో తొలి నుంచి అభ్యుదయ భావాలు ఎక్కువే. తను చెప్పాలనుకున్న విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పడం సామ్ స్టైల్. ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె వెనక్కి తగ్గదు. కెరీర్ స్టార్టింగ్ నుంచి సామ్ ఇదే వైఖరితో ఉంటారు. అప్పట్లోనే ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ల మధ్య పారితోషికం, మర్యాదల విషయాల్లో వివక్షపై గళమెత్తారు. నేను కూడా హీరోతో పాటు సమానమైన షెడ్యూల్‌లో పనిచేశాను. కానీ హీరోకి ఒకలా, నాకు మరోలా పారితోషికం ఇచ్చేవారు. ఇది పరిశ్రమలో నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. హీరో కారణంగానే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారన్న సంగతి నాక్కూడా తెలుసు.. కానీ కష్టాన్ని చూసి పారితోషికం ఇవ్వాలన్నదే నా అభిప్రాయమని కుండబద్ధలు కొట్టారు సమంత.

Samantha s Viral Instagram Post Questions Society s Double Standards on Women s Rights

హీరోలంటే మగాళ్లు మాత్రమేనన్న అభిప్రాయాన్ని ఆమె అస్సలు ఇష్టపడరు. ఇంకా లేడీ ఓరియెంటెడ్ ఫిలింస్‌ని ఇండస్ట్రీ ప్రోత్సహించడం లేదు. ధైర్యం, గొప్ప ఆశయాలు ఉండి ఎదుటి వ్యక్తికి స్పూర్తిగా నిలిచే ఎవరైనా సరే నా దృష్టిలో హీరోనే అని అప్పట్లో సమంత చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఇతరుల కోసం షెడ్యూళ్లను, అభిప్రాయాలను మాత్రమే కాదు.. మన లక్ష్యాలను కూడా త్యాగం చేస్తున్నాం. ఇదొక త్యాగం అని గుర్తించలేనంతగా మనం దీనికి అలవాటు పడిపోయాం. పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా క్షమాపణలు చెబుతారు. ప్రతిదానికి సారీ అనడం మానుకోవాలని సమంత హితవు పలికారు.

ఇదే కాదు.. చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపుల విషయంలోనూ సమంత అంతే ఘాటుగా బదులిచ్చిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కొద్దినెలల క్రితం మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణాలు, మహిళలపై వేధింపులను బయటకు తీసుకొచ్చిన జస్టిస్ హేమ కమిటీ కృషిని ఆమె అభినందించారు. కేరళ ప్రభుత్వం మాదిరిగానే మిగిలిన ప్రభుత్వాలు కూడా ఆయా ఇండస్ట్రీలలో మహిళల రక్షణ కోసం ప్రత్యేకంగా వింగ్స్ ఏర్పాటు చేయాలని సమంత డిమాండ్ చేశారు.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే సమంత.. తన సినిమాలు, షూటింగ్స్, ఇతర వ్యక్తిగత విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటున్న సామ్.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. తాజాగా తన ఇన్ స్టా స్టోరీలో ఆమె రాసుకొచ్చిన అంశం వైరల్‌గా మారుతోంది. సమాజం ఇంకా ఏ మాత్రం మారలేదని సామ్ అభిప్రాయపడ్డారు.. లైంగిక కార్మికులను తప్పుబడతారు కానీ, వారి వద్దకు వెళ్లే కస్టమర్లను ఏమీ అనరు. ఒంటరి తల్లులను నానామాటలు అంటారు.. కానీ పిల్లల బాధ్యత తీసుకోని తండ్రులను ఎవరూ ప్రశ్నించరు. అత్యాచారం జరిగినప్పుడు బాధితురాలినే తప్పుబడతారు కానీ నేరానికి పాల్పడిన వారిని నిలదీయరు. అలాంటి సమాజంలో మనం బతుకుతున్నామని సామ్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆమె పోస్ట్ వైరల్ అవుతుండగా.. సమంత పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+