పదేళ్ల నిరీక్షణ.. ఆకరికి పుట్టిన బిడ్డను చూడకుండానే కన్నతల్లి మృతి.. ఎక్కడంటే..?

తల్లి కావాలని పెళ్లి అయిన ప్రతి మహిళ కోరుకోవడం సహజం. అయితే అనేక కారణాల వల్ల వివాహం జరిగిన ఏళ్ల తర్వాత కూడా సంతానం కలగకపోవడం ఇటీవల అతిపెద్ద సమస్యగా మారింది. అలాగే ఓ తల్లి కూడా సంతానం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూసింది. ఆమెకు పెళ్లయి పదేళ్లు అయినా పిల్లలు కలగలేదు. అలా ఏళ్ల తరబడి ఎదురుచూసిన తర్వాత ఇంట్లో పసిబిడ్డ అడుగుపెట్టింది. కానీ ఆ ఆనందం ఎంతోసేపు మిగలలేదు. బిడ్డకు జన్మనిచ్చిన తల్లి ఆసుపత్రిలోనే ప్రాణాలు కోల్పోయింది. పుట్టిన బిడ్డను చూడకుండానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. దాంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. అయితే వైద్యుల నిర్లక్ష్యమే మహిళ మృతికి కారణం అని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు కుటుంబ సభ్యులు. ఈ హృదయవిదారకమైన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం చంబల్ గ్రామానికి చెందిన గౌడి లక్ష్మి (36) కి వివాహం జరిగి పదేళ్లు దాటింది. కానీ పిల్లలు లేరు. సంతానం కోసం ఏళ్ల పాటు ఎదురు చూసినా వారి ఆశలు ఫలించలేదు. అయితే సరికొత్త సాంకేతికతతో పిల్లలను కనొచ్చు అని తెలుసుకున్న ఆ దంపతులు ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిని ఆశ్రయించారు. అక్కడి వైద్యుల సూచనతో రూ.10 లక్షలు వెచ్చించి సంతానం కోసం ఐయూఐ, ఐవీఎఫ్ పద్ధతులను అనుసరించి ఆమె గర్భం దాల్చింది. దాంతో కుటుంబ సభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. కానీ ఆ హ్యాపీనెస్ ఎంతోసేపు నిలవలేదు.

Khammam After years waiting to become a mother she passed away shortly after giving birth khammam

తాజాగా బిడ్డకు జన్మినిచ్చిన తర్వాత లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఒక్కసారిగా విషమించింది. ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. రెండు రోజుల వ్యవధిలో సుమారు 20 ప్యాకెట్ల వరకు రక్తం లేదా రక్త ఉత్పత్తులు ఎక్కించాల్సి వచ్చింది. అయితే ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. ఇక లక్ష్మి ప్రాణాలు కాపాడేందుకు గర్భసంచిని తొలగించాల్సి ఉంటుందని వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు. వారి అంగీకారంతో గర్భసంచి కూడా తొలగించారు. అయినా ఆమె పరిస్థితి విషమించి ఆస్పత్రిలోనే ప్రాణాలు కోల్పోయింది. ఇక లక్ష్మి మృతిపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స అందించిన వైద్యులు, యాజమాన్యం వ్యవహరించిన తీరుపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ మేరకు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌ లో ఫిర్యాదు చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లి ఒడిలో పెరగాల్సిన పసిబిడ్డకు జన్మనిచ్చిన కొద్ది రోజులకే తల్లి లక్ష్మి ప్రాణాలు కోల్పోవడంతో ఆ బిడ్డ పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చెందుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+