చిరంజీవికి ఫోన్ చేసి 'సారీ' చెప్పిన జూనియర్ ఎన్టీఆర్
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి అగ్రస్థాయి కథానాయకుడిగా కొనసాగుతున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ఒక తరం హీరోలుకాగా, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లాంటివారు ఈ తరం కథానాయకులుగా కొనసాగుతున్నారు. పరిశ్రమలో ఎవరికి ఏ చిన్న సమస్య ఎదురైనా గతంలో దాసరి నారాయణరావు దగ్గరకు వెళ్లేవారు. ఆయన మృతిచెందిన తర్వాత చిరంజీవి దగ్గరకు వెళుతున్నారు. పరిశ్రమలో ఉన్నవారంతా చిరంజీవిని పెద్దదిక్కుగా భావిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ చేసిన సింహాద్రి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. దీని తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు తారక్ ఇచ్చిన సమాధానం ఎలా ఉందంటే.. పరిశ్రమలో పెద్ద హీరో అంటే మా తాత నందమూరి తారక రామారావుగారే అని చెప్పారు. అయితే ఈ సమాధానం చాలామందికి నచ్చలేదు. చిరంజీవికి వ్యతిరేకంగా తారక్ సమాధానం చెప్పాడని భావించారు. కొంతమంది దీనిపై భారీగా ట్రోలింగ్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు.

ఈ ఇంటర్వ్యూ చూసిన నాగార్జున వెంటనే తారక్ కు ఫోన్ చేశారు. నువ్వు అలా మాట్లాడకూడదు.. తప్పుగా మాట్లాడావు.. మాటతీరును బట్టి ఎంత అహంకారమో అనుకుంటారు.. పరిశ్రమలో పెద్దవాళ్లు చాలామంది ఉన్నారు.. వారందరికీ నువ్వు గౌరవం ఇవ్వాలి.. తెలిసి తెలియక నువ్వు మాట్లాడిన మాటలు నీ కెరీర్ ను కిందకు వెళ్లేలా చేస్తాయి.. ముందు నువ్వు చిరంజీవికి ఫోన్ చేసి సారీ చెప్పు అని క్లాస్ పీకారు. దీంతో నాగార్జున చెప్పినట్లుగానే జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్ చిరంజీవికి కాల్ చేసి సార్ చెప్పారు. తెలిసి తెలియక మాట్లాడాను.. అటువంటివేవీ మనసులో పెట్టుకోవద్దు.. నన్ను క్షమించండి సార్ అని తారక్ చిరుతో మాట్లాడారు. గతంలో జరిగిన ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications