పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్..
బాలీవుడ్‌లో లేడి ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను అలరిస్తుంది కంగనా రనౌత్. సినిమా హిట్టు, ప్లాపుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు తీసుకుంటూ వెళ్లిపోతుంది కంగనా. ఆమె తాజాగా చంద్రముఖి 2 సినిమాలో నటించారు. పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు చేసింది కంగనా రనౌత్..
శ్రీకృష్ణుడు ఆశీర్వాదంతో...
శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తానని బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. ఈ సందర్భంగా తన పొలిటికల్ ఎంట్రీపై వివరణ ఇచ్చారు. గుజరాత్‌లోని ప్రఖ్యాత శ్రీకృష్ణాలయం 'ద్వారకాధీష్'ను శుక్రవారం సందర్శించిన కంగనా తన పొలిటికల్ ఎంట్రీపై ఈ విధంగా స్పందించారు. అనంతరం అక్కడ ఆమె పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత ఆమె ఆలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ... వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అనే మీడియా ప్రశ్నకు ఆమె ఈ విధంగా సమాధానం ఇచ్చారు. ''శ్రీ కృష్ణ కీ కృపా రహీ తో లాంగే (శ్రీకృష్ణుడు ఆశీర్వదిస్తే నేను పోరాడతాను) అని తెలిపారు.

సుమారు ఆరువందల ఏళ్ల పోరాటం తర్వాత అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠత సాధ్యమైందని, ఇది కూడా బీజేపీ నేతృత్వంలోనే జరిగిందని, ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆమె ప్రశంసించారు. బిజెపి ప్రభుత్వం కృషితోనే భారతీయులమైన మనం ఈ రోజును చూడగలుగుతున్నాం. ఈ ఆలయాన్ని ఎంతో వైభవంగా నిర్మిస్తున్నారు. సనాతన ధర్మ పతాకాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎగురవేయాలని ఆమె అన్నారు.
క్షణం తీరిక దొరికినా, ఇక్కడికి వచ్చేస్తా...
ద్వారకా ఒక దివ్య నగరం. ఇక్కడ ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడి ప్రతి కణంలోనూ ద్వారకాధీష్ ఉంటుంది. ఆయనను చూడగానే నేను ధన్యురాలిని అవుతాను. వీలైనంత వరకు స్వామి వారి దర్శనం కోసం ఇక్కడికి రావడానికే ఎప్పుడూ ప్రయత్నిస్తుంటాను. పని నుంచి క్షణం తీరిక దొరికితే చాలు ఇక్కడికి వస్తుంటాను' అని కంగనా అన్నారు. సముద్రంలో మునిగిపోయిన ద్వారకా నగరం అవశేషాలను యాత్రికులు సందర్శించే సదుపాయాన్నికల్పించాలని కంగనా రనౌత్ ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం మీడియాతో కంగనా దర్శకత్వం వహించిన 'ఎమర్జెన్సీ', 'తనూ వెడ్స్ మను పార్ట్ 3 వంటి ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. ఆమె నటించిన తేజస్ చిత్రం ఇటీవలే విడుదలై ప్రేక్షకుల్లో మంచి ఆదరణ దక్కించుకుంది. ఈ సినిమాలో కంగనా ఫోర్స్ పైలట్ పాత్రను పోషించారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications