కోర్టు మెట్లు ఎక్కిన కేజీఎఫ్ హీరో యష్.. భార్య కూడా
ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువుగానే ఉంది. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేకుండాపోయింది. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధాంగా పరిస్థితి మారిపోయింది. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. తరువాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక , కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉన్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు.
తాజాగా హీరో యష్ సైతం కోర్టు మెట్లు ఎక్కారు. అయితే ఆయన విడాకులు కోసం కాదండోయ్. భార్యకు మద్దతుగా ఆయన కోర్టులో వాదించారు. యష్‌కు సంబంధించిన ఓ యాడ్ తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ప్రముఖ ఆయిల్ కంపెనీ కోసం భార్య రాధిక పండిట్‌తో కలిసి యష్ ఓ యాడ్ చేశారు. ఇందులో యష్ భార్య రాధిక పండిట్ మోసపోయిన కస్టమర్ పాత్రలో నటించారు. కాగా కంపెనీ యొక్క నిజమైన వంట నూనెను నిరూపించడానికి యష్ వాదించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ రియల్ లైఫ్ కపుల్ రీల్ లైఫ్‌లో కూడా కలిసి నటించడంతో ఫ్యాన్స్, నెటిజన్లు అంతా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక కేజీఎఫ్ సినిమాతో యష్ స్టార్ డమ్ ఒక్కసారిగా మారిపోయింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన కేజీఎఫ్ మొదటి పార్ట్ సూపర్ హిట్‌గా నిలిచింది. దీంతో కేజీఎఫ్ పార్ట్-2పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
అందరి అంచనాలను నిలబెడుతూ కేజీఎఫ్ పార్ట్-2 కూడా సూపర్ హిట్‌గా నిలిచింది. ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఈ సినిమా రూ.1200 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. యష్ ప్రస్తుతం టాక్సిక్ అనే సినిమాలో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఈ సినిమాతో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.












Click it and Unblock the Notifications