మహిళల శరీరంమీద దుస్తులు లేకుండా పూజలు చేయిస్తున్న వేణుస్వామి?
ప్రతిరోజు వివాదాస్పద అంశాలపై తనకు తోచినట్లుగా చెబుతూ దాన్నే జాతకంగా ప్రచారం చేసే వేణుస్వామి గురించి ఏపీ, తెలంగాణలో తెలియనివారుండరు. నిత్యం ఏదో ఒక యూట్యూబ్ ఛానెల్ లో వివాదాస్పద అంశాలపై ఇంటర్వ్యూలు ఇస్తూ, వాటిని వైరల్ చేయిస్తూ చివరకు ఇతను కూడా ఒక సెలబ్రిటీలా తనను తాను మార్చుకున్నాడు. సెలబ్రిటీల గురించి మాట్లాడితేనే మనం కూడా సెలబ్రిటీలమవుతామని గట్టగా నమ్మే వేణుస్వామి దాన్నే అనుసరిస్తున్నాడు. సోషల్ మీడియాలో ఇతని పేరు ప్రతిరోజు వినపడుతూనే ఉంటుంది. తాజాగా ఆయనపై జబర్దస్త్ మాజీ నటుడు కిరాక్ ఆర్పీ మండిపడ్డారు.
బెట్టింగ్ లు కట్టి మునిగిపోయారు
గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పాడని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అవుతాడని, రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని చెప్పాడని, జరిగింది కళ్లకు కనపడటంలేదా? అని కిరాక్ ఆర్పీ ప్రశ్నించాడు. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుందని చెప్పారని, అతని మాటలు నమ్మి ఎంతోమంది బెట్టింగ్ లు కట్టి నిండి మునిగిపోయారని ధ్వజమెత్తారు. తాజాగా వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి విడిపోతారని చెబుతున్నాడని, చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ జాతకాల గురించి కూడా వేణుస్వామి కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు.

జగన్, సజ్జల ప్రచారం
ప్రభాస్ కు హిట్ రాదని వేణుస్వామి చెబుతున్నాడని, వైఎస్ జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి కలిసి ఇలాంటి ప్రచారం చేయిస్తున్నారని ఆర్పీ సంచలన ఆరోపణలు చేశారు.వేణుస్వామి తన భార్య శ్రీవాణిని ఎందుకు తల్లి దగ్గరకు పంపడం లేదని నిలదీశాడు. నల్లధనం ఉన్నవారికే వేణుస్వామి అపాయింట్ మెంట్ ఇస్తాడని, మెల్ల కన్నును కవర్ చేసుకుంటాడని, అమ్మాయిలతో నగ్న పూజలు చేయిస్తున్నాడని తెలిసిందన్నారు. కొంతమంది చంపుతామని బెదిరిస్తున్నారని హైదరాబాద్ వచ్చి చంపుకోండని ఆయన వెల్లడించారు. ఆర్పీ చేసిన వ్యాఖ్యలపై వేణుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి మరి.












Click it and Unblock the Notifications