ఆగస్టు 5 నుంచి త్రిగ్రాహి యోగంతో 4 రాశులకు అపార ఐశ్వర్యం!

జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల కలయికకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా కొన్ని గ్రహాలు కలిసి ఒకే రాశిలో సంచరించినప్పుడు శక్తివంతమైన యోగాలు ఏర్పడుతుంటాయి. ఈ క్రమంలోనే ఆగస్టు 5న జరగబోయే గ్రహాల కలయిక అత్యంత అరుదైనదిగా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం కర్కాటక రాశిలో సూర్యుడు, దేవగురువు బృహస్పతి కొలువై ఉన్నారు. ఆగస్టు 5న బుద్ధి, వ్యాపార కారకుడైన బుధుడు కూడా కర్కాటక రాశిలోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఇలా ఒకే రాశిలో సూర్యుడు, గురుడు, బుధుడు కలవడంతో అత్యంత శుభప్రదమైన 'త్రిగ్రహి యోగం' ఏర్పడనుంది. సూర్య-బుధుల వల్ల 'బుధాదిత్య యోగం' సిద్ధించడమే కాకుండా, గురుడి కలయిక వల్ల జ్ఞానం, గౌరవం, అపార ధన ప్రాప్తి కలుగుతాయని వేద పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ మహా యోగం వల్ల ప్రధానంగా 4 రాశుల వారి జాతకం పూర్తిగా మారిపోనుంది. ఆ అదృష్ట రాశులేవో ఇప్పుడు చూద్దాం!

Horoscope Immense wealth for 4 zodiac signs starting August 5 due to the Trigrahi Yoga

కర్కాటక రాశి వారికి సమాజంలో హోదా!

ఈ త్రిగ్రహి యోగం స్వయంగా కర్కాటక రాశిలోనే ఏర్పడుతుండటంతో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. సమాజంలో హోదా, కీర్తి ప్రతిష్టలు విపరీతంగా పెరుగుతాయి. మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి బంగారం లాంటి అవకాశాలు తలుపు తడతాయి.

వృశ్చిక రాశి వారికి విదేశీ యోగం!

వృశ్చిక రాశి వారికి ఈ యోగం తొమ్మిదో (భాగ్య) స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల అదృష్టం మీ వెంటే ఉండి, నిలిచిపోయిన పనులన్నీ చకచకా పూర్తవుతాయి. వ్యాపారం చేసేవారికి ఊహించని లాభాలు వస్తాయి. విదేశాల్లో ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థుల కల నెరవేరుతుంది.

మేష రాశి వారికి సొంతింటి కల నెరవేరే కాలం

మేష రాశి వారికి ఈ యోగం సుఖ స్థానంలో ఏర్పడుతోంది. దీనివల్ల కాలంగా ఎదురుచూస్తున్న సొంతిల్లు, కొత్త వాహనం లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసే యోగం ఉంది. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన గుర్తింపు లభించి, ప్రమోషన్లు వరించే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంలో ఆనంద నిలయమవుతుంది.

మిథున రాశి వారికి ధన వర్షం

మిథున రాశి వారికి ఈ త్రిగ్రహి యోగం ధన స్థానంలో సంభవించనుంది. దీనివల్ల ఆర్థికంగా తిరుగులేని పురోగతి కనిపిస్తుంది. గతంలో రాకుండా ఆగిపోయిన డబ్బు మీ చేతికి అందుతుంది. మీ మాట తీరుతో సమాజంలో ఇతరులను సులభంగా ఆకట్టుకుంటారు. వ్యాపారస్తులకు పెద్ద పెద్ద కాంట్రాక్టులు, డీల్స్ కుదిరే అవకాశాలున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+