తెలంగాణలో మరో కొత్త రైల్వేలైన్.. భద్రాచలానికి నేరుగా.. భక్తులకు పండుగే!

తెలంగాణ రాష్ట్రానికి రైల్వే అనేక వరాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో అవసరమైన అదనపు లైన్ల ఏర్పాటుతోపాటు, రైల్వే స్టేషన్లను ఆధునీకరించడం, అవసరమైన చోట అదనపు రైళ్లను ఏర్పాటు చేయడం వంటి అనేక చర్యలకు శ్రీకారం చుడుతోంది. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన భద్రాచలంలోని శ్రీ రామచంద్ర స్వామి ఆలయానికి వెళ్లే భక్తులకు శుభవార్త చెప్పింది.

రూ.2864 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం మీదుగా రైల్వే లైన్

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పాండురంగాపురం, భద్రాచలం, మల్కన్ గిరి, నూతన రైల్వే ప్రాజెక్టు వివరాలను వెల్లడించింది. కేంద్రం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రత్యేక రైల్వే ప్రాజెక్టుగా దీనిని ప్రకటించింది. ఈ మార్గాన్ని 2864 కోట్ల అంచనా వ్యయంతో అత్యాధునిక ఇంజనీరింగ్ ప్రమాణాలతో నిర్మించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. తొలిసారిగా భద్రాచలాన్ని రైల్వే మ్యాప్ లోకి తీసుకురావడం ఎంతోకాలంగా భద్రాచల పుణ్యక్షేత్రానికి వస్తున్న లక్షలాదిమంది భక్తులకు సంతోషాన్ని కలిగిస్తున్న అంశం.

Bhadrachalam railway line New Pandurangapuram-Bhadrachalam-Malkangiri railway project know details

తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో భద్రాద్రి రామయ్య చెంతకు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాద్రి ఆలయానికి వెళ్లేందుకు రైల్వే సౌకర్యం ఉంటే తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో ఆలయానికి వెళ్లి రావడానికి అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా రైల్వే నిర్మిస్తున్న ఈ కొత్త లైన్ భద్రాచలానికి ప్రయాణం చేసే ప్రయాణికులకు ఖర్చు, సమయాన్ని ఆదా చేసే గొప్ప మార్గం. ఇక ఈ ప్రాజెక్టును ప్రయాణికుల భద్రత, గరిష్ట వేగానికి ప్రాధాన్యతనిస్తూ ప్రత్యేకంగా డిజైన్ చేశారు.

పాండురంగాపురం, భద్రాచలం, ఏపీ మీదుగా ఒడిశాలోని మల్కన్ గిరి

ఈ రైల్వే ట్రాక్ భవిష్యత్తులో గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేసే రైళ్లు తిరిగేలా రూపకల్పన చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాండురంగాపురం నుంచి ప్రారంభమయ్యే ఈ రైలు భద్రాచలం మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా గుండా ప్రయాణం చేసి ఆపై ఒడిస్సా లోని పలు జిల్లాలను కలుపుతూ మల్కన్ గిరి వరకు ఈ రైలు మార్గం సాగుతుంది.

ఈ ప్రాజెక్ట్ లో అనేక ప్రత్యేకతలు, ప్రధాన ఆకర్షణలు

ఈ మూడు రాష్ట్రాల పరిధిలో ప్రాజెక్టు నిర్మాణం కోసం మొత్తం 843.9 హెక్టార్ల భూమి అవసరమని రైల్వేశాఖ ప్రాథమికంగా గుర్తించింది. ముఖ్యంగా భద్రాచలం సమీపంలో గోదావరి నది పైన నిర్మించబోయే భారీ రైల్వే వంతెన ఈ ప్రాజెక్టులో ప్రధాన ఆకర్షణ. అంతేకాదు ఈ రైల్వే లైన్ నిర్మాణంలో ఎక్కడా ఒక్క లెవెల్ క్రాసింగ్ కూడా ఉండకపోవడం గమనార్హం. మొత్తం ఈ రైల్వే లైన్ లో 300కు పైగా చిన్న, పెద్ద వంతెనలు ఏర్పాటు చేస్తారు.

వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి

41 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, 66 రైల్వే అండర్ బ్రిడ్జిలను నిర్మిస్తారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని రైల్వే ప్లాన్. ఈ కొత్త రైల్వే లైన్ ఏర్పాటు జరిగితే తెలంగాణతో పాటు, ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా రాష్ట్రాలకు సంబంధించి కొన్ని ప్రాంతాలలో ప్రగతి పరుగులు తీస్తుంది.

భోగాపురం ఎయిర్ పోర్ట్ పై ప్రధాని ఆసక్తికర పోస్ట్, చంద్రబాబు ఇంట్రెస్టింగ్ రిప్లై!
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై ప్రధాని ఆసక్తికర పోస్ట్, చంద్రబాబు ఇంట్రెస్టింగ్ రిప్లై!

నిత్యం రద్దీగా ఉండే వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ మార్గానికి ప్రత్యామ్నాయం

ఉత్తర, తూర్పు భారతదేశపు రవాణా కనెక్టివిటీ పెరుగుతుంది. ఈ కొత్త మార్గం నిర్మాణం జరిగితే నిత్యం రద్దీగా ఉండే వరంగల్, విజయవాడ, విశాఖపట్నం, భువనేశ్వర్ ప్రధాన రైల్వే మార్గానికి మంచి ప్రత్యామ్నాయం లభిస్తుంది. పారిశ్రామిక అభివృద్ధికి, వర్తక వాణిజ్యాలకు ఈ రైల్వే లైన్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+